Anti-CAA protests: అలీగఢ్‌లో హింసాత్మకంగా మారిన సీఏఏ ఆందోళనలు
పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక, అనుకూల మద్దతుదారుల మధ్య ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చేపట్టిన ఆందోళనలు అదుపుతప్పాయి. జఫ్రాబాద్‌లో ఆదివారం సాయంత్రం అనుకూల, వ్యతిరేక వర్గాలు
Anti-CAA protests: పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక, అనుకూల మద్దతుదారుల మధ్య ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చేపట్టిన ఆందోళనలు అదుపుతప్పాయి. జఫ్రాబాద్‌లో ఆదివారం సాయంత్రం అనుకూల, వ్యతిరేక వర్గాలు ఒక్కసారిగా రాళ్లు రువ్వుకొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఇక్కడి మెట్రో స్టేషన్ వద్ద శనివారం రాత్రి దాదాపు 500 మందితో నిరసన ప్రారంభమైంది. వీరిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. దీంతో శీలంపూర్‌ను మౌజ్‌పూర్, యమునా విహార్‌తో కలిపే రహదారి దిగ్బంధమైపోయింది.
కాగా.. భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో అలీగఢ్‌లో కలెక్టరేట్ వరకు తలపెట్టిన ర్యాలీని పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు నగరంలోని ప్రార్థనా మందిరం వద్దనున్న ధర్నా శిబిరానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు ఆస్తుల ధ్వంసానికి దిగారు. భారతీయులుగా చెప్పుకోవడాన్ని తాము గర్వంగా భావిస్తామని.. కానీ తమపై పాకిస్థానీలుగా ముద్ర వేయడం వేదనకు గురిచేస్తోందని షాహీన్‌బాగ్ మహిళా నిరసనకారులు తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈ మేరకు ఆదివారం సుప్రీంకోర్టులో వారు అఫిడవిట్ దాఖలు చేశారు.
ఘర్షణల తరువాత, సాయంత్రం ఆరు గంటల నుండి మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేయబడింది. పోలీసుల చర్యలను నిరసిస్తూ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థులు అలీఘర్-మొరాదాబాద్ హైవేను దిగ్బంధం చేశారు.
[svt-event date=”24/02/2020,8:03AM” class=”svt-cd-green” ]
Chandra Bhushan Singh, Aligarh District Magistrate (DM): Internet services suspended in the city area of Aligarh district. https://t.co/9LYKZnGgzB
— ANI UP (@ANINewsUP) February 23, 2020
[/svt-event]