తన భర్త సంపాదనపై.. పంచ్ వేసి తప్పించుకున్న సుమ

తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌లో పలు న్యూస్ ఛానెల్లో ఫేమస్ అయిన యాంకర్లు గేమ్ ఆడారు. వారిలో జాఫర్ ఒకరు. ఈ సందర్భంగా ఆయన సుమ భర్త సంపాదన గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 'మీరు మీ భర్త కంటే ఎక్కువగా సంపాదిస్తూంటారని..

తన భర్త సంపాదనపై.. పంచ్ వేసి తప్పించుకున్న సుమ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 24, 2020 | 8:12 AM

క్రికెట్‌లో ఎంతమంది క్రికెటర్లు ఉన్నా.. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ అన్నట్టు.. టాలీవుడ్‌లో ఎంతమంది యాంకర్లు ఉన్నా.. యాంకర్ సుమ కనకాల క్రేజే వేరు. అలాగే.. వీరి జంట చాలా స్పెషల్. ఇద్దరికి ఇద్దరూ అంతే. పంచులు వేసి తప్పించేసుకుంటారు. కాగా.. వీరిద్దరి రెమ్యునరేషన్‌పై గత కొన్ని రోజులుగా ఫుల్లు కామెంట్స్ ట్రోల్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇఫ్పుడు మళ్లీ క్యాష్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆ ప్రశ్న మరోసారి రిపీట్ అయ్యింది. దీంతో.. అందరిముందు బహిరంగంగానే తన భర్త సంపాదన గురించి చెప్పేసింది సుమ.

తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌లో పలు న్యూస్ ఛానెల్లో ఫేమస్ అయిన యాంకర్లు గేమ్ ఆడారు. వారిలో జాఫర్ ఒకరు. ఈ సందర్భంగా ఆయన సుమ భర్త సంపాదన గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘మీరు మీ భర్త కంటే ఎక్కువగా సంపాదిస్తూంటారని బయట టాక్. అసలు ఇంతకీ రాజీవ్ కనకాల ఎంత సంపాదిస్తున్నారు అని ప్రశ్నలు’ వేశారు. ఈ ప్రశ్నకు ఎక్కడా తడుముకోకుండా వెంటనే సమాధానం ఇచ్చింది సుమ.

ఈ ప్రశ్న అడిగిన తర్వాత మీకు కింద కొన్ని కామెంట్స్ వస్తాయి. మీకెందుకు అంటూ ఘాటుగానే కామెంట్స్ పెడతారు.. అవసరమా అదిప్పుడు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది సుమ. అయితే.. నిజానికి తన కన్నా సుమ ఎక్కువ సంపాదిస్తున్న విషయాన్ని స్వయంగా రాజీవే ఒప్పుకున్నారు.

ఇది కూడా చదవండి: Crime: కోడి కోసం.. కన్నకొడుకునే చంపేశాడు