AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ విలన్.. చూస్తేనే వణికిపోవాల్సిందే

ఇండస్ట్రీలో చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు.కొంతమంది స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోయారు. ఇక మరికొంతమంది వరుస సినిమాలు చేస్తున్నారు. మరికొందరు లేడీ విలన్స్ గా రాణిస్తున్నారు.

అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ విలన్.. చూస్తేనే వణికిపోవాల్సిందే
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 28, 2025 | 8:42 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. లేడీ విలన్ గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే పాన్ ఇండియా హిట్ సాధించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? హీరోయిన్స్ కు మించిన క్రేజ్ ఉన్న ఆ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి : ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు అందాల భామ శ్రియ రెడ్డి. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది. శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది.

ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రియ రెడ్డి. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. సలార్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న శ్రియ రెడ్డి.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం సలార్ 2 సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ నటిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోనూ శ్రియ రెడ్డి విలన్ గా నటించనుందని టాక్. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్ ఫొటోలతో కవ్విస్తుంది.

ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

శ్రియ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

ఇది కూడా చదవండి :ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి