AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terrorist Attack: దెబ్బ మీద దెబ్బ.. ఇక గొంతెండిపోవడమే.. ఇంత చిన్న లాజిక్‌ని పాకిస్తాన్‌ ఎలా మర్చిపోయిందబ్బా..

ఇట్స్‌ రివెంజ్‌ టైమ్‌. మిలటరీ ఆప్షన్స్‌ను పక్కన పెడితే...ముందుగా సింధు అస్త్రాన్ని పాక్‌పై ప్రయోగించింది భారత్‌. దిక్కుతోచని పాక్‌...ఇండియాపై సిమ్లా అస్త్రాన్ని ప్రయోగించింది. అయితే ఈ సిమ్లా ఒప్పందం రద్దయితే ఏమవుతుంది? దీనివల్ల మనకు నష్టాలేనా? లాభాలు కూడా ఉన్నాయా? పాకిస్తాన్ కు భారత్ ఎలా చెక్ పెట్టనుంది.. ఈ కథనంలో తెలుసుకోండి..

Pahalgam Terrorist Attack: దెబ్బ మీద దెబ్బ.. ఇక గొంతెండిపోవడమే.. ఇంత చిన్న లాజిక్‌ని పాకిస్తాన్‌ ఎలా మర్చిపోయిందబ్బా..
India Pakistan
Shaik Madar Saheb
|

Updated on: Apr 26, 2025 | 10:50 AM

Share

పాకిస్తాన్‌ను పరోక్షంగా భారీ దెబ్బ కొట్టింది మన దేశం. సింధునదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. సింధు నది, దాని ఉప నదులు రావి, బియాస్‌, సట్లెజ్‌, చీనాబ్‌, జీలం.. మన దేశం గుండానే పాక్‌కి వెళతాయి. పాకిస్తాన్‌కి సింధు నదే జీవనాడి. సాగు, తాగునీటికి కూడా ఈ నదే ఆధారం. ఈ వాటర్‌ బంద్‌తో పాక్‌లో 90శాతం ఆయకట్టుకు కటకట తప్పదు. ఇక్కడ మనం ట్యాప్‌ కట్టేస్తే, అక్కడ కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ నగరాలకు గొంతెండి పోవడం ఖాయం. పాక్‌ జీడీపీలో 23 శాతం పైగా ఉన్న వ్యవసాయ రంగం కుదేలవక తప్పదు. దీంతో పాకిస్తాన్‌ ఎడారిగా మారడం ఖాయం అంటున్నారు నిపుణులు.

సిమ్లా ఒప్పందం రద్దు చేసిన పాక్‌.. “బరి” తెగించిన పాకిస్తాన్‌

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేయడంతో…దానికి ప్రతీకారంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది పొరుగు దేశం. నో మోర్‌ లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అంటూ, బరి తెగించి పాక్‌ రంకెలు వేస్తోంది. భారత్‌తో తమకు హద్దుల్లేవు, సరిహద్దుల్లేవు అంటూ కారం తిన్న కాకి లాగా మండిపడుతోంది.

1972లో సిమ్లా ఒప్పందం

1971లో భారత్‌, పాకిస్తాన్ యుద్ధం తర్వాత, 1972లో ఇరు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా “సిమ్లా ఒప్పందం” కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, 1971 డిసెంబర్ 17నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నియంత్రణ రేఖగా మార్చారు. భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా, ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందం వల్ల ఐక్యరాజ్య సమితి కూడా కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా, కశ్మీర్‌ అంశాన్ని ప్రపంచం ముందు పెట్టొచ్చని, నానా యాగీ చేయొచ్చని పాకిస్తాన్‌ పన్నాగం పన్నింది. దీనికితోడు LOC లేకపోవడంతో ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం అవుతుందని పాక్‌ ప్లాన్‌ చేసింది.

చిన్న లాజిక్‌ని మర్చిపోయిన పాక్‌

ఇక సిమ్లా ఒప్పందం రద్దయితే.. పీవోకేని తన కంట్రోల్‌లోకి తీసుకోవడానికి భారత్‌కి అవకాశం దొరికినట్టే అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్‌ ఇంత చిన్న లాజిక్‌ ఎలా మర్చిపోయిందబ్బా అంటున్నారు.. మొత్తానికి భారత్ పాకిస్తాన్‌ కు ముచ్చెమటలు పట్టిస్తోంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..