ఒక్కరు ప్రయాణించడానికి.. అంత పెద్ద కార్లు అవసరమా?
ఒక్కరు ప్రయణించడానికి దాదాపు 1,500 కేజీల బరువున్న కారును ఉపయోగిస్తున్నారన్నారు మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా. 60 నుంచి 70 కేజీల బరువున్న ఒక వ్యక్తి 1,500 కేజీల బరువున్న కారును ప్రతీ రోజు నిత్యవసరాలకు ఉపయోగిస్తున్నారని..
ఒక్కరు ప్రయణించడానికి దాదాపు 1,500 కేజీల బరువున్న కారును ఉపయోగిస్తున్నారన్నారు మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా. 60 నుంచి 70 కేజీల బరువున్న ఒక వ్యక్తి 1,500 కేజీల బరువున్న కారును ప్రతీ రోజు నిత్యవసరాలకు ఉపయోగిస్తున్నారని, దీని వల్ల వనరులు వృధా అవుతున్నాయన్నారు. అలాగే ఆటోమొబైల్ పరిశ్రమలో ఎక్కువగా కాలుష్యం ఉన్న సంగతి కూడా ఆయన అంగీకరించారు. అయితే ఒక వ్యక్తి ప్రయాణించడానికి పెద్దకారు అవసరం లేదని, అందుకే అతి తక్కువ బరువైన టాటా నానోను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే టాటా కారులో ఎక్కువగా కాలుష్యం ఉన్న కారణంగా, అది సరిగ్గా పనిచేయలేదన్నారు.
ఒక వ్యక్తి కారులో ప్రయాణించడానికి వీలుగా, అనుకూలంగా ఉండేలా.. ఒక చిన్న కారును విడుదల చేస్తున్నామని, త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం విడుదల చేయబోయే చిన్న కారులో 7 శాతం కార్బన్ డాయాక్సైడ్, 2.5 పీఎంలోని ఐదవ భాగాన్ని అందిస్తాయన్నారు. దీంతో.. కాలుష్య ప్రభావం చాలా తక్కువగా ఉంటుదని చెప్పారు. కాగా.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా పనులు జరుగుతున్నాయన్నారు. బ్యాటరీలు, ఛార్జింగ్ ద్వారా నడిచే బైక్, ఆటోలను తీసుకురానున్నట్లు గోయెంకా తెలిపారు.
అయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ల విషయానికొస్తే భారత దేశం చైనా కంటే ఐదేళ్లు వెనుకబడి ఉంది. 2019లో ఈవీల కార్లు కేవలం 1400లు మాత్రమే కొనుగోలు చేయబడ్డాయన్నారు. ఇది ప్రపంచ డిమాండ్‌తో పోలీస్తే చాలా తక్కువ శాతమన్నారు. దేశ మొత్తం ఆర్థికాభివృద్ధిలో ఆటో రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read More: ఇకపై స్మోకింగ్ చేయాలంటే ఈ వయసు దాటాల్సిందే!