AP Cabinet: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. వారి కోసం ఫైనాన్స్ కార్పొరేషన్.. కేబినెట్ నిర్ణయాలివే
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అవసరాల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అవసరాల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ కల్పించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపాల్టీలల్లో ఖాళీ స్థలాలకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై చర్చించి మున్సిపాల్టీల్లో ఖాళీ స్థలాలకు 50% పన్ను రాయితీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
నూర్ బాషా, దూదేకుల సామాజిక వర్గాలను ఆర్థికంగా అభిృద్ధి చేసేందుకు AP నూర్ బాషా/దూదేకుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. AP DISCOMSకు రూ. 3,762 కోట్ల నాబార్డ్ రుణానికి గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంలో రైడెన్ ఇన్ఫోటెక్ నోటిఫైడ్ పార్టనర్‌లుగా 6 సంస్థలన అనుమతిస్తూ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
అర్బన్ ఏరియాల్లో డిజిటల్ డిస్‌ప్లే డివైజెస్ నియంత్రణ నిబంధనల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకం BharatNet 2.0 అమలు కోసం కొత్త SPV ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రతిగ్రామంలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను విస్తరించండం ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




