బెయిల్ రద్దు చేయాలంటూ పురందేశ్వరి ఫిర్యాదు.. వెన్నుపోటు రాజకీయం మీదంటూ విజయసాయి రెడ్డి ట్వీట్..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. గడిచిన పదేళ్లుగా విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ.. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి లేఖలో కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించిన పురందేశ్వరి.. విజయసాయిరెడ్డిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

బెయిల్ రద్దు చేయాలంటూ పురందేశ్వరి ఫిర్యాదు.. వెన్నుపోటు రాజకీయం మీదంటూ విజయసాయి రెడ్డి ట్వీట్..
Purandeswari vs MP Vijayasai Reddy
Follow us
Venkata Chari

|

Updated on: Nov 04, 2023 | 12:27 PM

Purandeswari vs MP Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా ఈ వరుసలోకి చేరింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడంతో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పదేళ్లుగా విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని.. జనాలను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని పురందేశ్వరి లేఖలో పేర్కొన్నారు. విజయసాయి తన పదవులను అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని.. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాతలో ఏపీలో మద్యం, ఇసుక, భూముల, మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. విజయసాయిపై నమోదైన కేసుల తాలూకా వివరాలతో పాటు ఇటీవల మద్యం, ఇసుక, మైనింగ్ వివరాలను జత చేస్తూ.. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి లేఖలో కోరారు. దీంతో విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా పురందేశ్వరికి కౌంటర్ ఇచ్చారు.

పురందేశ్వరి ఫిర్యాదుపై విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ‘‘అమ్మా పురందేశ్వరి గారూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు. అంటే… మీది కుటుంబ రాజకీయమా?. కుల రాజకీయమా? కుటిల రాజకీయమా?. లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా?’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్…మళ్లీ బీజేపీ…ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే…ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది’ అంటూ మరో ట్వీట్‌లో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది.

ఈ క్రమంలో విజయసాయి రెడ్డి ఎక్స్‌లో వరుసగా ట్వీట్లు చేస్తూ.. పురందేశ్వరిపై మాటల యుద్ధానికి తెర తీశారు.

‘పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్…మళ్లీ బీజేపీ…ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే…ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది’ అంటూ ఘాటుగా స్పందించారు.

‘ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా? ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ?హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు.0

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..