Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kandukuru TDP: ఇంటూరికి ఇంటి పంచాయితీ.. రాజేష్‌కు వంత పాడుతున్న శివరాం.. కందుకూరులో క్యాండిడేట్ ఎవరు?

ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ 2004 తరువాత అంటే వరుసగా నాలుగు సార్లు అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా టీడీపీ అక్కడ గెలవాలని గట్టిగానే ట్రై చేస్తోంది. .కానీ ఇంత వరకు బాగానే ఉన్నా టీడీపీ రెబల్ అభ్యర్థి రూపంలో మరోసారి టీడీపీకి గట్టి దెబ్బ పడేలా ఉందనేది అక్కడి స్థానికుల మాట.

Kandukuru TDP: ఇంటూరికి ఇంటి పంచాయితీ.. రాజేష్‌కు వంత పాడుతున్న శివరాం.. కందుకూరులో క్యాండిడేట్ ఎవరు?
TDP
Follow us
Fairoz Baig

| Edited By: Balaraju Goud

Updated on: Apr 03, 2024 | 4:35 PM

ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ 2004 తరువాత అంటే వరుసగా నాలుగు సార్లు అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా టీడీపీ అక్కడ గెలవాలని గట్టిగానే ట్రై చేస్తోంది. .కానీ ఇంత వరకు బాగానే ఉన్నా టీడీపీ రెబల్ అభ్యర్థి రూపంలో మరోసారి టీడీపీకి గట్టి దెబ్బ పడేలా ఉందనేది అక్కడి స్థానికుల మాట. టీడీపీ రెబల్ అభ్యర్థిని బుజ్జగించేందుకు హేమా హేమీలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఇప్పుడు టీడీపీ నేతలు ఇంటి పోరుతో తలలు పట్టుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం జిల్లాల పునర్విభజన లో నెల్లూరు జిల్లాలో చేరింది.1994 నుంచి 2004 వరకు వరుసగా రెండు సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దివి శివరాం విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించగా, 2014, 2019 లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే 20 ఏళ్లుగా విజయం దక్కని టీడీపీ ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే టీడీపీకి కందుకూరులో రెబల్ బెడధతో గట్టిగానే దెబ్బ పడేలా ఉంది. కందుకూరు టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్‌ టిక్కెట్ ఆశించారు. అయితే చివరికి టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావును టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి ఇంటూరి రాజేష్ ఇక్కడ టీడీపీ రెబల్ అవతారం ఎత్తారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కందుకూరు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందకు సిద్ధం అయ్యారు.

ఇక నామినేషన్ ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం లో దూసుకుపోతున్నారు రాజేష్. అయితే రాజేష్‌ను రెబల్ రేసులో నుంచి తప్పించేందుకు టీడీపీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. అలాగే గతంలో టీడీపీ అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు గెలిచిన డాక్టర్ శివరాం కూడా రాజేష్ కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం, రాజేష్ కి కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే కందుకూరు టీడీపీలో రెబెల్ వ్యవహారం ఇక్కడి వైసీపీ ప్లస్ అవుతుందని అంటున్నారు ఇక్కడి వైసీపీ నేతలు. అయితే టీడీపీ రాజేష్ వ్యవహారం ఇలాగే కొనసాగుతుందా లేదా మధ్యలోనే బ్రేక్ పడుతుందా అనే ఆసక్తికంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…