Andhra Pradesh: 3 రాష్ట్రాలుగా మారుతున్న 3 రాజధానుల వ్యవహారం..! ప్రత్యేక ఉత్తరాంధ్ర లక్ష్యంగా కొత్త పార్టీ..

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల డిమాండ్ కాస్తా.. 3 రాష్ట్రాల వివాదంగా ఎందుకు మారుతోంది? మళ్లీ ప్రత్యేక ఉత్తరాంధ్ర నినాదం ఎందుకు తెరపైకి వస్తోంది..?

Andhra Pradesh: 3 రాష్ట్రాలుగా మారుతున్న 3 రాజధానుల వ్యవహారం..! ప్రత్యేక ఉత్తరాంధ్ర లక్ష్యంగా కొత్త పార్టీ..
Andhra Pradesh Politics
Follow us

|

Updated on: Dec 31, 2022 | 7:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల డిమాండ్ కాస్తా.. 3 రాష్ట్రాల వివాదంగా ఎందుకు మారుతోంది? మళ్లీ ప్రత్యేక ఉత్తరాంధ్ర నినాదం ఎందుకు తెరపైకి వస్తోంది..? ఇదే డిమాండ్‌తో పార్టీనే పుట్టుకురావడాన్ని ఎలా చూడాలి? గ్రేటర్ రాయలసీమ డిమాండ్ మళ్లీ ఎన్నికల ఎజెండాగా మారబోతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర వర్సెస్ రాయలసీమ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజుకుంటున్న కొత్త వివాదం ఇది.. మంత్రి ధర్మాన కామెంట్స్‌తో రాజుకున్న మంటలు.. శరవేగంగా రాయలసీమను టచ్‌ చేశాయి.. అక్కడ అగ్గిరాజేస్తున్నాయి.. కొత్త నినాదాలు, వివాదాలను మోసుకొస్తున్నాయి.. ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చి మరోసారి తేనెతుట్టెను కదిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కామెంట్స్‌పై సహజంగానే సీమ నేతలు ఫైర్‌అవుతున్నారు. పార్టీలకు అతీతంగా ఓకే డిమాండ్ వినిపిస్తున్నారు. మీకు ఉత్తరాంధ్ర కావాలంటే మాకు ప్రత్యేక రాయలసీమ ఇవ్వండని సూటిగా అడుగుతున్నారు.

తెలంగాణ మాదిరిగానే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. టీడీపీ సీమనేతలు కూడా గ్రేటర్‌ రాయలసీమ జపం చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా రిటైర్డ్ IRS అధికారి మెట్ట రామారావు ఉత్తరాంధ్ర పార్టీ ఏర్పాటు చేశారు. వచ్చేనెలలో పార్టీ రిజిస్ట్రేషన్‌కు సన్నాహాలు చేస్తున్నారు. 2019 లో జనసేన పార్టీ తరఫున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు మెట్ట రామారావు.

ఇవి కూడా చదవండి

ఓవైపు ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవ్వాలంటూ మంత్రి ధర్మాన వ్యాఖ్యలు.. అదే లక్ష్యంతో కొత్త పార్టీ పుట్టుకురావడం ఏపీ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా హీటెక్కించాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..