క్రూర మృగాలతో మైక్ టైసన్ చెలగాటం
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ యువకుడిగా ఉన్నప్పుడు ఏకంగా ఓ భారీ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని ది ఇండిపెండెంట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడే స్వయంగా తెలిపాడు. 1980ల్లో టైసన్ ఒక సారి తన అప్పటి భార్య రాబిన్ గివెన్స్‌తో కలిసి న్యూయార్క్‌లోని జూకు వెళ్లాడు. అప్పట్లో అతడి సందర్శన కోసం ప్రత్యేక వేళల్లో దానిని తెరిచారు.
ఆ జూలో ఓ భారీ సిల్వర్ బ్యాక్ గొరిల్లా మిగిలిన వాటిని వేధించడం టైసన్ కంటపడింది. అది చూడటానికి చాలా బలంగా ఉన్నా.. కళ్లు మాత్రం చిన్న పిల్లలా ఉన్నాయనీ తాను దాంతో పోరాడాలని నిర్ణయించుకొన్నాననీ టైసన్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. జూ కీపర్‌ను పిలిచి 10,000 డాలర్లు ఇస్తాను బోన్‌లోకి పంపించమని కోరానన్నాడు. ఆ సిల్వర్ బ్యాక్ గొరిల్లాతో ఫైట్ చేసి మట్టి కరిపిస్తానని చెప్పానన్నాడు. కానీ, జూ కీపర్ అందుకు నిరాకరించాడని తెలిపాడు. టైసన్‌కు క్రూర మృగాలతో చెలగాటమాడటం కొత్తేమీ కాదు. గతంలో లాస్ వేగాస్‌లోని తన మాన్షన్‌లో రెండు పులులను పెంచుకొన్నాడు. కానీ, ఆ తర్వాత రెండేళ్లకు వాటిని పెంచుకోవడం అంత మంచి నిర్ణయం కాదని ఇంటర్వ్యూలో అంగీకరించాడు. అది మూర్ఖపు నిర్ణయమనీ, పులులను 100 శాతం పెంపుడు జంతువుల్లా మార్చలేమని.. అది జరిగే పనికాదనీ క్లారిటీ వచ్చిందన్నాడు. వాటితో ఆడుకొనే సమయంలో పొరబాటున అవి చంపొచ్చని.. అలాగే మీరు ఒకసారి దానిని కొడితే.. అది తిరగబడొచ్చని.. అప్పుడు మీ ప్రాణాలే పోవచ్చని క్లియర్ గా చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాలిని అమ్మడం ఏందిరా బాబు !! రూ.1,000కి టిన్ను గాలా ??
ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల క్యాష్
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
స్కూల్ బ్యాగ్ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

