ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల క్యాష్
ఆవు పేడ కుప్పలో ఏకంగా రూ.20 లక్షలకు పైగా డబ్బు దొరికింది. పేడ కుప్పలో అంత డబ్బు దాచిపెట్టడం ఏంటని సందేహంగా ఉందా? ఇదంతా దొంగ సొమ్ము. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న ఓ కంపెనీలో ఏకంగా రూ.20 లక్షలకు పైగా డబ్బును దొంగిలించాడు. ఈ డబ్బుని తన బావకు ఇచ్చి స్వగ్రామానికి పంపించాడు.
కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సాయం తీసుకొన్నారు. బాలాసోర్ జిల్లాలో ఉన్న బాదమందరుని గ్రామంలో నిందితుడి అత్తమామలు ఉంటారు. వారి ఇంట్లో ఉన్న ఆవు పేడ కుప్పలో ఈ డబ్బును దాచిపెట్టినట్టు గుర్తించారు. హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు జరిపిన సోదాల్లో శనివారం ఈ నగదు బయటపడింది. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. కమర్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు. డబ్బు కొట్టేసిన నిందితుడి పేరు గోపాల్ బెహెరా అని, అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించామని తెలిపారు. గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. హైదరాబాద్ లోని వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
స్కూల్ బ్యాగ్ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!
మెకానిక్ రాఖీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే.. ఈ వీడియో చూడాలి కదా..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

