వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
ఒకప్పుడు పొలాలు లోని పంట దొంగలు ఎత్తుకెళ్ళకుండా కాపలాదారులను ఏర్పాటు చేసేవారు లేదా పొలం చుట్టూ కంచెలను పెట్టి పంటకు రక్షణ కల్పించేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీని ఉపయోగించి పొలంలోని పంటకు సీసీ కెమెరాలను అందులోనూ సిసి సోలార్ సిసి కెమేరాలను ఏర్పాటు చేసి పంటను ఎవరు దొంగిలించకుండా పహారా కాస్తున్నారు.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో కొంతమంది రైతులు తమ పొలాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పండ్ల తోటలకు ఇవి తప్పనిసరిగా మారిపోయాయి. ఎందుకంటే రేటు ఎక్కువగా వచ్చే పంటలకు దిగుబడి సమయంలో చాలామంది వాటిని దొంగిలించుకుపోవడం వలన రైతు నష్టపోతున్నాడు.. అందువలన పొలం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పంటను రక్షించుకుంటున్నారు. గతంలో పొలానికి కాపలాదారులను నియమించి రాత్రంతా కాపలా కాయించేవారు , ఆ తరువాత పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసి పంటలను రక్షించుకునేవారు, ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో మ్యాన్ పవర్ ను తగ్గించి 24 గంటలు పంటను రక్షించుకునే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు…. అంతేకాకుండా కరెంటు అయితే బిల్లు భారీగా వస్తుందని అలాగే అగ్రికల్చర్ కు నిత్యం కరెంట్ సదుపాయం ఉండకపోవడం వలన సోలార్ సిస్టం ద్వారా సిసి కెమెరాలను అమర్చి పంటకు నిత్యం కాపలా పెడుతున్నారు. అలాంటిదే అట్లూరు మండలంలో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
స్కూల్ బ్యాగ్ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!
మెకానిక్ రాఖీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే.. ఈ వీడియో చూడాలి కదా..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

