విరాట్- అనుష్క శర్మ విడాకులు !! కోహ్లీ ట్వీట్ వైరల్

Phani CH

22 November 2024

ప్రెసెంట్ ఇండస్ట్రీలో  విడాకుల ట్రెండ్  నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. కొన్నేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు.

రీసెంట్ గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తన 29 ఏళ్ల కాపురానికి గుడ్ చెప్పేసాడు.. ఇప్పుడు కోహ్లీ అనుష్క శర్మ విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కోహ్లీ అనుష్క శర్మ ప్రేమించుకుని 2017లో  ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ వామిక, అకాయ్ అనే ఒక పాప, బాబు ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో  ఓ పోస్ట్ పెట్టాడు. అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆ పోస్ట్ లో.. వెనక్కి తిరిగి చూసుకుంటే.. మేము ఎప్పుడూ కాస్త భిన్నంగా ఉంటాం. మేం ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు.

ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా.. రెండుసార్లు మిస్‌ఫిట్ అయ్యాం. అయితే.. కొందరు మమ్మల్ని వెర్రివాళ్ళని పిలిచారు. ఇతరులు దానిని ఆమోదించలేదు.

కానీ..వాటిని ఎప్పుడూ మేం పట్టించుకోలేదు. 10 ఏళ్ల కిందట రైట్ అనిపించింది.. ఇప్పుడు రాంగ్ అవ్వొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్లిపోవాలి’ అంటూ రాసుకొచ్చారు విరాట్ కోహ్లీ. విరాట్  పోస్ట్ తో అనుష్కకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.