గ్రీన్ టీ తో అనేక లాభాలు.. పరిమితి మించితే అనేక నష్టాలు కూడా.. 

Phani CH

22 November 2024

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు గ్రీన్ టీ తాగడం ట్రెండ్ గా మారింది.. అయితే ప్రతి ఒక్కరు గ్రీన్ టీ తాగుతున్నారు కానీ దీని వల్ల కలిగే ఉపయోగాలు చాలా తక్కువమందికే తెలుసు.

ఫ్యాటీ లివర్ ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతిఒక్కరు గ్రీన్ టీని తయారు చేసి తాగడం చేస్తున్నారు ప్రజలు.

చాలామంది గ్రీన్ టీ బరువు తగ్గుతారు అని చాలా మంది నమ్ముతున్నారు. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల ముఖంలో కూడా మంచి రూపం కనిపిస్తుంది.

ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు కూడా ప్రతిరోజూ ఈ హెల్తీ డ్రింక్ తాగాలని సూచిస్తున్నారు. అయితే గ్రీన్ తాగేవారు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి.

వేసవిలో దీన్ని ఎక్కువగా తాగడం వల్ల ఒక్కోసారి ముక్కు నుంచి రక్తం లేదా ఇతర హాని కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

చలికాలంలో కూడా దీన్ని ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే తాగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ప్రయోజనాలు పొందడం కోసం ఎక్కువ కప్పులు తాగకూడదు.

అధికంగా ఎక్కువగ తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా మొదలవుతాయి. ఒకవేళ కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలున్న వారు పొరపాటున కూడా గ్రీన్ టీని తాగకూడదు.