ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవన శైలికి చిన్న నుండి పెద్దవారి వరకు అనేక రోగాల బారిన పడుతున్నారు.. వారిలో ఎక్కువగా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
అయితే వీటిలో మధుమేహం నియంత్రణలో లేకుంటే గుండె జబ్బులు, కిడ్నీలు, ఊపిరితిత్తులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఊబకాయం, మధుమేహం రెండింటినీ నియంత్రించడంలో రాగులు సహాయాపడతాయని నిపుణుల అభిప్రాయం. ఇవే కాకుండా అనేక రోగాలు నియంత్రిస్తాయట.
డయాబెటిక్ రోగులు ప్రతి రోజు రాగులు తీసుకుంటే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది.
రాగుల్లో బి1, బి2, బి6, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫోలేట్, మాంగనీస్, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడంలో రాగులు చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలకు కూడా రాగులు చాలా మేలు చేస్తాయి.
రక్తహీనతకు కూడా చాల వరకు రాగులు తగ్గిస్తాయి. దీంతో చర్మంపై ముడతలు రావు.. ముఖం మెరుస్తుంది. రాగులు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
రాగి రొట్టెలు తినడం వల్ల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగి జావా తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.