ఆ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి !! ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా

Phani CH

19 November 2024

హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి టాప్ హీరోయిన్ ఎదిగింది.

దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరి స్టార్ హీరోల సరసన నటించింది.. కోలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ అందుకుంది మీనా.

అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే పాప కూడా జన్మించింది.

ఈ పాప ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా దూసుకుపోతున్న మీనాకు సడన్ షాక్ తగిలిందని చెప్పవచ్చు.

అయితే గత కొద్ది రోజుల క్రితం విద్యాసాగర్ అనారోగ్యంతో సమస్యలతో తుది శ్వాస విడిచారు. అప్పటి నుండి మీనా రెండో పెళ్లి పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

విడాకులు తీసుకొని సింగిల్ గా ఉన్న స్టార్ హీరోల పేర్లు బయటకు తీసి వీరిని మీనా రెండో పెళ్లి చేసుకుంటుంది అన్నట్లు రూమర్స్ తెచ్చారు.

తాజాగా ధనుష్ తో మీనాకు ఎఫైర్స్ ఉన్నట్లు కూడా రూమర్స్ సృష్టించారు. అయితే తాజాగా మీనా వీటిపై స్పందించి పెళ్లిపై రకరకాల వార్తలు రాస్తున్నారని, అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు.