ఇమ్యూనిటీని బూస్ట్ చేసే 5 అద్భుతమైన హోమ్ మేడ్ డ్రింక్స్

Phani CH

19 November 2024

సీజన్స్ మారడంతో పాటు రకరకాల వ్యాధులు కూడా మారుతూ ఉంటాయి.. జలుబు, జ్వరం, దగ్గు వంటి రకరకాల సమస్యలు వస్తుంటాయి.

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా మన బాడీ లో మ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఇలాంటి అంటు వ్యాధులు సోకుతుంటాయి.

అయితే మన ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఇమ్యూనిటీ బలోపేతం చేసే 5  అద్భుతంగా పని డ్రింక్స్ చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం-తులసి: అల్లంలో ఉండే యాంటీ వైరల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ ఇస్తాయి. తులసి ఇమ్యూనిటీని వేగంగా పెంచుతుంది. రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితాలుంటాయి

పసుపు-పాలు: పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. వేడి పాలలో చిటికెడు పసుపు కొద్దిగా తేనె కలుపుకుని తాగితే జలుబు, దగ్గు సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ, తేనె: తేనె కలిపి తాగడం వల్ల విటమిన్ సి లోపం ఉండదు. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజూ పరగడుపున తాగాల్సి ఉంటుంది

క్యారట్-ఆరెంజ్: వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఈ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా వివిధ రకాల సీజనల్ వ్యాధుల్నించి కాపాడుతాయి

ఉసిరి-తేనె: ఉసిరి చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది. తాజా ఉసిరి రసాన్ని తీసి నీళ్లలో కలిపి దానికి తేనె జోడించి ఉదయం పూట తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.