రేగు పండులో పొటాషియం , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఇవి పనిచేస్తాయి.
రేగు పండ్లలో చాలా పోషకాలు, విటమిన్ సి అధికంగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
రేగు పండ్ల వలన రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి చాల అవసరం.
రేగు పండ్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను పెరగనివ్వ కుండా క్యాన్సర్‌ను నిరోధించడానికి పనిచేస్తుంది. ముఖ్యంగా నోటి, బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
రేగు పండ్లలో విటమిన్ కె ఉంటుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడేవారికి ఎంతో మేలు చేస్తుంది. కీళ్లకి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
రేగిపండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ.
రేగు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మల బద్ధకం ఉన్నవారికి చాలా మంచిది. వీటిని రోజూ తింటే మల బద్ధకం సమస్య చాలావరకు తగ్గిపోతుంది.