- Telugu News Photo Gallery Cinema photos Devara celebration about 50 days function kubera glimpse released
మూవీ లవర్స్ లో జోష్ పెంచుతున్న దేవర, కుబేర మూవీస్
డే టు డే హ్యాపెనింగ్స్ ఎన్ని ఉన్నా, కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. దేవర 50 డేస్, కుబేర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్... ఇలాంటివన్నీ మూవీ లవర్స్ లో జోష్ పెంచుతున్నాయి. అంతగా హల్‌చల్ చేస్తున్న ఈ వార్తల గురించి మనం కూడా మాట్లాడుకుందాం పదండి...
Phani CH |
Updated on: Nov 22, 2024 | 9:58 PM

డే టు డే హ్యాపెనింగ్స్ ఎన్ని ఉన్నా, కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. దేవర 50 డేస్, కుబేర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్... ఇలాంటివన్నీ మూవీ లవర్స్ లో జోష్ పెంచుతున్నాయి. అంతగా హల్‌చల్ చేస్తున్న ఈ వార్తల గురించి మనం కూడా మాట్లాడుకుందాం పదండి...

సముద్రాన్ని ఎరుపెక్కించిన సినిమా దేవర. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుని దుమ్మురేపిన మూవీ కూడా ఇదే. పూర్తి యాక్షన్ డ్రామాగా మెప్పించింది. దేవర 50 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.

52 సెంటర్లలో దేవర మూవీ ఈ క్రెడిట్‌ని సొంతం చేసుకుంది. తారక్ దేవర మాత్రమే కాదు, అక్కినేని నాగార్జున, ధనుష్ నటించిన కుబేర కూడా ట్రెండింగ్‌లో ఉంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈసినిమాలో రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నారు. మనీ చుట్టూ తిరిగే కథ అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, కేరక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలతో జనాలకు రీచ్ అయింది కుబేర.

ఇప్పుడు వాటన్నిటినీ మించిన ఇంటెన్స్ విజువల్స్ తో మెప్పిస్తోంది ఫస్ట్ గ్లింప్స్. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైంది క్లిప్.