విమానంలో సిగరెట్ తాగాడు.. ఆ తర్వాత ??
కొంత మంది తెలిసీ తెలియక చేసిన తప్పులు వారిని ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. విమానంలో సిగిరెట్ తాగడం నిషేధం. ఈ విషయం చాలా మంది ప్రయాణికులకు తెలుసు. అయితే ఓ యువకుడు సెక్యూరిటీ కళ్లు గప్పి మరీ విమానంలోకి సిగరెట్‌తో ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సిగరెట్ తాగి అడ్డంగా బుక్ అయ్యారు. ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు.
ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆదివారం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ అనే యువకుడు ఆబుదాబీకి వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎక్కాడు. అయితే విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతుండగా, అహ్మద్ రహస్యంగా సిగరెట్ తాగాడు. ఇది గమనించిన ఎయిర్ హోస్టస్ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఎంతో క్షుణ్ణంగా జరిగే తనిఖీలను తప్పించుకుని అతను సిగరెట్‌తో విమానంలోకి ఎలా ప్రవేశించాడనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది.. ల్యాబ్ మేడ్ గోల్డ్.. బంగారం కాదన్నా మీరు నమ్మలేరు
క్రూర మృగాలతో మైక్ టైసన్ చెలగాటం
గాలిని అమ్మడం ఏందిరా బాబు !! రూ.1,000కి టిన్ను గాలా ??
ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల క్యాష్
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

