శభాష్.. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్లు.. మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
RTC Drivers Honesty: పుట్టపర్తి ఆర్టీసీ బస్ డిపో డ్రైవర్ల నిజాయితీ చాటుకున్నారు. ఓ ప్రయాణీకుడు ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన బంగారు నగలు, కీలక డాక్యుమెంట్లను తిరిగి ఆ వ్యక్తికి అప్పగించారు. దీనిపై టీవీ9 కథనానికి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. X ద్వారా నిజాయితీ చాటుకున్న ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లకు అభినందనలు తెలిపారు.
పుట్టపర్తి ఆర్టీసీ బస్ డిపో డ్రైవర్ల నిజాయితీ చాటుకున్నారు. ఓ ప్రయాణీకుడు ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన బంగారు నగలు, కీలక డాక్యుమెంట్లను తిరిగి ఆ వ్యక్తికి అప్పగించారు. దీనిపై టీవీ9 కథనానికి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. X ద్వారా నిజాయితీ చాటుకున్న ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన సోమయ్య అనే ప్రయాణికుడు పుట్టపర్తి-నెల్లూరు సర్వీస్ ఆర్టీసీ బస్సులో బంగారు నగలు, కీలక డాక్యుమెంట్లు మరచిపోయాడు. ఈ క్రమంలో పుట్టపర్తి ఆర్టీసీ డిపో డ్రైవర్లు నారాయణ, శేఖర్ తమ నిజాయితీని చాటుకున్నారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ప్రయాణికుడుకి అందజేశారు. ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీని మెచ్చుకుంటూ టీవీ9 కథనం ప్రసారం చేసింది.
ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీపై టీవీ9 లో ప్రసారమైన కథనాన్ని ట్యాగ్ చేస్తూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో డ్రైవర్లను అభినందించారు. హీరోలు ఎప్పుడూ టోపీలు ధరించరు – కొన్నిసార్లు యూనిఫాం ధరించి బస్సులు నడుపుతారు. పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు నారాయణ, శేఖర్ చిత్తశుద్ధి, అంకితభావానికి నిజమైన అర్థం అంటూ రాసుకొచ్చారు. ప్రయాణికులలో ఒకరు పొరపాటున బస్సులో బంగారు ఆభరణాలు, కీలకమైన పత్రాలను మరిచిపోయారు. దీంతో వీళ్లు.. ఆ వస్తువులను భద్రపరచి డిపో మేనేజర్‌కు అప్పగించారు. వారి నిజాయితీని మెచ్కోవాల్సిందే. ప్రజా రవాణా అనేది మన ప్రజలకు జీవనాధారం. ఇలాంటి సంఘటనలు ప్రయాణికులు, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య నమ్మకాన్ని బలపరుస్తాయని ట్వీట్ ద్వారా అభినందించారు మంత్రి లోకేశ్.
ఆర్టీసీ డ్రైవర్లకు నారా లోకేశ్ ప్రశంసలు
Heroes don’t always wear capes – sometimes, they wear uniforms and operate buses. Narayana and Shekar, RTC drivers from Puttaparthi depot, embody the true meaning of integrity and dedication. When one of the passengers accidentally left gold jewellery and critical documents on… https://t.co/wtlkvVKUDC
— Lokesh Nara (@naralokesh) November 20, 2024