AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్.

Samantha: అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్.

Anil kumar poka
|

Updated on: Nov 22, 2024 | 9:59 AM

Share

మయోసైటిస్‌ తర్వాత సినిమాలను బాగా తగ్గిస్తూ వచ్చిన సమంత ఇటీవల సిటాడెల్‌ వెబ్ సిరీస్‌ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సమంత యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్‌ మీడియా వేదికగా మాత్రం సమంత ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా వివరాలతో పాటు, వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది సామ్‌.

సమంత మరో సారి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. తనకు ఇన్‌స్పిరేషన్‌గా ఉన్న ఓ పోయమ్‌ను తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంది. ఆ పోయమ్‌ను షేర్ చేయడమే కాదు.. ఇది తనకు ఎప్పుడూ మార్గదర్శకంగా ఉందంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. ఇక సమంత ఈ పోయాన్ని షేర్ చేయడం పక్కకు పెడితే.. దీని అర్థం ఏంటంటే..! “మీరు రిస్క్‌తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్లీ ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. అంతేగానీ.. ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గరం ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పెట్టుకోండి. అప్పుడు మనల్ని నిందించేవారికి సరైన సమాధానం చెప్పొచ్చు” అది సంగతి. ఎందుకోసం ఇలా రాసిందో మాత్రం మీరు అడగొద్దు.. మేం చెప్పం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow Us