రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో తేనె కీలక పాత్ర పోషిస్తుంది. చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేయడంలో తేనె ఉపయోగపడుతుంది.
సాధారణంగా చలికాలం చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. తేనెను అప్లై చేసుకోవడం వల్ల మాయిశ్చరైజర్‌గా పనిచేసి, మృదువుగా మార్చేలా చేస్తుంది. పెదవులు పగలకుండా ఉంటాయి.
తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ప్లెమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించే వైరస్‌లను తరిమికొట్టడంలో ఉపయోగపడుతుంది.
చలికాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా తేనె ఉపయోగపడుతుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే శ్వాస సమస్యలు దూరమవుతాయి.
శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడంలో తేనె ఎంతో ఉపయోగపడుతుంది. ఒత్తిడి, అలసటతో బాధపడేవారు తేనె తీసుకుంటే ఇన్‌స్టాంట్ శక్తి లభిస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా. అయితే తేనె తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని తాగితే శరీరం రిలాక్స్ అవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.