AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది ఈ ప్రాంతంలోనే

ట్రాఫిక్ పోలీసులు విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో.. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కొంతమేర తగ్గింది. అయితే 3 కమిషనరేట్స్ పరిధిలో ఎక్కువగా ఏ ప్రాంతంలో ఈ యాక్సిడెంట్స్ జరగుతున్నాయో పూర్తి వివరాలతో తెలుసుకుందాం పదండి....

Telangana:  తెలంగాణలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది ఈ ప్రాంతంలోనే
Road Accident
Vijay Saatha
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 22, 2024 | 4:13 PM

Share

తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అయితే తెలంగాణ మొత్తంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న ఘటనలు సైబరాబాద్‌లో అధికంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు అనేక విధానాలను అవలంబిస్తున్నారు. డ్రైవింగ్‌పై అవగాహనతో పాటు స్పీడ్ లిమిట్ ఎక్కువగా ఉన్న చోట్లలో ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా సూచనలు చేస్తున్నారు.

హైదరాబాదులో ఉన్న మూడు కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గడచిన 3 సంవత్సరాలలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోనే చోటుచేసుకున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉండటంతో రోడ్డు ప్రమాదాలు వాటి ద్వారా చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 2022లో సైబరాబాద్‌లో 749 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోతే 2023లో 710 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు 680 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా తమ ప్రాణాలు విడిచారు.

ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంతో పోలిస్తే ఈసారి రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా తగ్గింది. సిటీ సెంటర్లో నిత్యం ట్రాఫిక్ ప్రత్యేక డ్రైవ్‌లతో పాటు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉండటంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గింది. 2022లో హైదరాబాదులో 301 మంది ప్రాణాలు కోల్పోతే 2023లో 280 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారు. ఇక తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు 215 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు విడిచారు.

రాచకొండ పరిధిలోను రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. 2022లో 655 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే 2023 లో 609 మంది ప్రాణాలు విడిచారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 525 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించారు. అయితే రాచకొండ పరిధిలో హైవేలు ఎక్కువగా ఉంటుండడంతో రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైవేలో ఎక్కడన్నా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే తక్షణం స్పందించే విధంగా పరిసరాల్లో ఉన్న పెట్రోల్ బంకులు, దాబా సిబ్బందికి యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండెంట్ ట్రైనింగ్‌ను ఇచ్చారు . వీటి ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగిరా సరే తక్షణం స్పందిస్తుండటంతో చాలామంది ప్రాణాలు నిలబడ్డాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..