YS Sharmila: హీరో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు: షర్మిల
YS Sharmila: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం జగన్ తన సైతాన్ సైన్యంతో.. తనకు, ప్రభాస్‌కు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని, అసలు ప్రభాస్ ఎవరో నాకు తెలియదని అన్నారు. అప్పుడు నా పిల్లల మీద ప్రమాణం చేశా.. ఇప్పుడు చేస్తున్నా.. జగన్‌కు నాపై ప్రేమ ఉంటే ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు? గాడిదలు కాశావా జగన్?’ అంటూ మండిపడ్డారు. తనపై లేనిపోని ప్రచారం చేయించారని, ప్రభాస్ తనకు ఎలాంటి సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు.
Published on: Nov 22, 2024 01:21 PM
వైరల్ వీడియోలు
Latest Videos