Winter Food: శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Winter Food: శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Anil kumar poka

|

Updated on: Nov 22, 2024 | 12:22 PM

శీతా కాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా రోగాల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రత్యేకంగా లభించే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఈ సీజన్‌లో లభించే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో వీటిని ఎక్కువగా తినేవారు కాబట్టే.. మీ ఇంట్లో పెద్దవాళ్లు ఆరోగ్యంగా ఉండేవారు. చలి కాలం ప్రారంభం కాగానే లభించే వాటిల్లో తేగలు కూడా ఒకటి. దీపావళి పండక్కి ఇవి ఎక్కువగా లభిస్తాయి. దేవుళ్ల ప్రసాదంగా నివేదించి.. అనంతరం వీటిని తింటూ ఉంటారు. ఈ తేగల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడే సమస్యల్లో రక్త హీనత కూడా ఒకటి. తేగల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. నేరుగా తిన్నా, ఎండలో ఆరబెట్టి పొడి చేసి.. దానిలో బెల్లం కలిపి తీసుకున్నా మంచిదే. బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని డైట్‌లో చేర్చుకుంటే ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది.

తేగలు తినడం వల్ల డయాబెటీస్, బీపీ నియంత్రణలో ఉంటాయి. వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్‌లో ఎలాంటి మార్పులు రావు. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. క్యాల్షియం మెండుగా లభిస్తుండటంతో తేగలు తినడం వల్ల దంతాలు బలంగా మారతాయి. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరం. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.