అల్లు అర్జున్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మరణం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అల్లు అర్జున్ను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నట్లు ఉందన్నారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారుతుందని వ్యాఖ్యానించారు.