సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఇందులో కోటి రూపాయలు అల్లు అర్జున్, రూ.50 లక్షలు నిర్మాతలు, రూ.50 లక్షలు దర్శకుడు సుకుమార్ అందజేయనున్నట్లు తెలిపారు.