AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మృత్యువు పొలికేక.. పిట్టల్లా రాలిపోతున్న యువత! కర్నూలులో మరో ఘోరం.. వీడియో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకూ స్నేహితుడి పెళ్లిలో అల్లరి చేస్తూ అందరినీ నవ్వించిన యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.. ఏం జరిగిందో అర్ధం చేసుకునేలోపు ఆయువు తీరిపోయింది..

Viral Video: మృత్యువు పొలికేక.. పిట్టల్లా రాలిపోతున్న యువత! కర్నూలులో మరో ఘోరం.. వీడియో
Man Dies Of Heart Attack On Stage
Srilakshmi C
|

Updated on: Nov 22, 2024 | 4:13 PM

Share

కర్నూలు, నవంబర్‌ 22: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా పలువురు వ్యక్తులు చావు వచ్చి అప్పటికప్పుడు పిలిచినట్లుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్నారు. నెలల పసికందు నుంచి ఉడుకు రక్తం యువత వరకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. గతంలో ఎన్నడూలేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక యువత ఆందోళన చెందుతుంది. తాజాగా ఏపీలో మరో సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి పెళ్లికి వెళ్లి, స్టేజ్‌పై నవ దంపతులకు శుభాకాంక్షలు చెబుతుండగా మృత్యువు పిలిచింది. అంతే..అక్కడికక్కడే గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో ఓ జంట పెళ్లి వేడుక జరుగుతుంది. నూతన దంపతులకు పలువురు స్టేజ్‌పైకి వచ్చి కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతలో వంశీ అనే వ్యక్తి తన స్నేహితులు కొంత మందితో స్జేజ్‌పైకి వచ్చాడు. నవవధువరులకు వారంతా గిఫ్ట్‌ ఇచ్చారు. వారిచ్చిన బహుమతిని వరుడు తెరచి చూస్తుండగా.. స్నేహితులంతా ఆనందంగా నవ్వుతూ చూడసాగారు. ఇంతలో వంశీ ఒక్కసారిగా స్టేజ్‌పైనే కుప్పకూలాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపు అక్కడే ప్రాణాలొదిలాడు. వంశీ అమెజాన్‌లో ఉద్యోగి. బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న వంశీ.. స్నేహితుడి పెళ్లికి వచ్చి ప్రాణాలొదలడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగి పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో వరుడు బహుమతిని విప్పుతుండగా.. వంశీ తన ఎడమ వైపుకు వంగి బ్యాలెన్స్ కోల్పోవడం కనిపిస్తుంది. వెంటనే అతన్ని ధోన్ సిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు వంశీ చనిపోయినట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

కాగా దేశ యువతలో గుండెపోటు ఇటీవలి కాలంలో పెరగడం ఆందోళన కరంగా మారింది. మన దేశంలో దాదాపు 25-30 శాతం గుండెపోటు కేసులు ఇప్పుడు 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల్లో వస్తున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఇది గత దశాబ్దాలతో పోలిస్తే భారీగా పెరిగింది. దీని నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా