Vishwak Sen: అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు కొందరు హీరోలు చేస్తున్న కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. వాళ్లు కావాలని చేస్తున్నారో.. లేదంటే అలా అనేస్తున్నారో తెలియదు కానీ తాజాగా మెకానిక్ రాకీ సినిమా విషయంలో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆడకపోతే నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర షర్టు విప్పి తిరుగుతా.. ఫిల్మ్ నగర్‌లో చొక్కా విప్పేస్తా లాంటి మాటలు మాట్లాడనంటూ ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు విశ్వక్.
విశ్వక్ చేసిన కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే పుష్ప సినిమా విడుదల సమయంలో.. సుకుమార్ డైరెక్షన్ గురించి చెప్తూ.. పుష్ప రిలీజ్ అయ్యాక దర్శకులంతా సుకుమార్ దగ్గరికి వచ్చి క్లాస్ నేర్చుకుంటారు.. అలా జరక్కపోతే మైత్రి ఆఫీసులో షర్టు విప్పి తిరుగుతా అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేసారు. అయితే గతంలో అల్లు అర్జున్ చేసిన ఆ కామెంట్స్‌కు ఇప్పుడు విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్‌ను జత చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే అలాంటిదేం లేదని.. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని.. అసలు బన్నీ అలా అన్నట్లు కూడా తనకు తెలియదన్నారు విశ్వక్. పుష్ప 2 ట్రైలర్ విడుదల అయినపుడు తానే విష్ చేశానని గుర్తు చేసారీయన. విశ్వక్ క్లారిటీతో ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడ్డట్లే అనుకోవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

