AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike: వాయమ్మో.. కొంప ముంచిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టిన కాసేపటికే..

తెలంగాణలో ఈ మద్య ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ బైకుల అగ్ని ప్రమాద వార్తలే వినిపిస్తున్నాయి. ఏకంగా ఒక్కో చోట ఎలక్ట్రిక్ బైక్ లు బాంబుల్లా పేలుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చార్జ్ చేసే సమయంలో ఓవర్ హీట్ అయి అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. భారీగా ఎగిసి పడే మంటలతో సమీపంలో ఉండే విలువైన వస్తువులను ఇంటి సామాగ్రిని కాల్చి బూడిద చేస్తున్నాయి. ఫలితంగా యజమానులు తీవ్ర ఆస్తి నష్టం భారీన పడక తప్పడం లేదు.

Electric Bike: వాయమ్మో.. కొంప ముంచిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టిన కాసేపటికే..
Electric Scooter Fire
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 22, 2024 | 4:59 PM

Share

తెలంగాణలో ఈ మద్య ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ బైకుల అగ్ని ప్రమాద వార్తలే వినిపిస్తున్నాయి. ఏకంగా ఒక్కో చోట ఎలక్ట్రిక్ బైక్ లు బాంబుల్లా పేలుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చార్జ్ చేసే సమయంలో ఓవర్ హీట్ అయి అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. భారీగా ఎగిసి పడే మంటలతో సమీపంలో ఉండే విలువైన వస్తువులను ఇంటి సామాగ్రిని కాల్చి బూడిద చేస్తున్నాయి. ఫలితంగా యజమానులు తీవ్ర ఆస్తి నష్టం భారీన పడక తప్పడం లేదు. తాజాగా, జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ అగ్ని ప్రమాదానికి గురై ఇల్లంతా మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లగా.‌. ఆ ఘటన మరువక ముందే మంచిర్యాల జిల్లాలోను ఈ బైక్ ఓ యజమానిని నిండా ముంచేసింది. రాత్రి చార్జింగ్ పెట్టి పడుకున్న ఆ యజమానికి తెల్లవారి లేచి వూసే సరికి తీరని ఆస్తి‌నష్టాన్ని మిగిల్చింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ షార్ట్ సర్క్యూట్ తో ఏకంగా నాలుగు బైక్ లు కాలిబూడిదయ్యాయి.. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో చోటు చేసుకుంది.

చింత పండు‌ వాడలో కిరాణ షాపు‌ నిర్వహిస్తున్న తిరుపతి అనే వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఎప్పటిలాగే యజమాని బైక్ లతో పాటు ఇంటి ముందు ఎలక్ట్రిక్ బైక్ ను పార్క్ చేసి ఎప్పటిలాగే రాత్రి చార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. అంతే రాత్రి పదిన్నర ప్రాంతంలో ఒక్కసారి బైక్ షార్ట్ సర్క్యూట్ కు గురై భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో అద్దెకుంటున్న వ్యక్తులకు అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే మంటలు విస్తరించాయి. ఈ బైక్ పక్కనే పార్క్ చేసిన రెండు స్కూటీ లు, ఒక యమహా బైక్ కు మంటలు అంటుకుని కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనతో‌ నాగరాజు నివాసంలో అద్దెకుంటున్న వాహనదారులు లబోదిబోమన్నారు. యజమాని నాగరాజుతో పాటు రామ్మోహన్ అనే మరో వ్యక్తి బైక్ కూడా ఈ ఘటనలో కాలిబూడిదైంది. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతవ్వడంతో నాలుగు లక్షలకు పైగానే ఆస్తి నష్టం‌ సంభవించినట్టు ఇంటి యజమాని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క‌ ఎలక్ట్రిక్ బైక్ మిగిల్చిన నష్టంతో నాలుగు కుటుంబాలు ఆర్థిక నష్టాన్ని మోయాల్సి వచ్చిందని ఆవేదనకు గురయ్యారు‌ బాధితులు.. వరుస ప్రమాదాలతో ఈ బైక్ అంటేనే వణికిపోయే పరిస్థితి తలెత్తిదంటున్నారు‌ వాహనదారులు..

వీడియో చూడండి..

రోజురోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటం.. ఇంధన ధరలు చుక్కలను తాకుతుండటంతో.. విలవిలలాడిపోతున్నామని… పెట్రోల్ బండిని బయటకు తీయాలంటేనే భయపడుతున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ బాధ లేని ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి పెట్టి ఈ బైక్ లు కొనుగోలు చేస్తే.. అవి కాస్త ఇలా కొంపలు ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు‌ బాధితులు. కరెంటుతో ఛార్జ్‌ చేసుకోవడం, తక్కువ ఖర్చుతో అవసరం తీరడంతో జనం ఈ బైక్‌ వైపు మొగ్గు చూపుతున్నా… వరుసగా చోటు చేసుకుంటున్న ఎలక్ట్రిక్ వాహన ప్రమాదాలతో షాక్ కు గురవుతున్నారు. తాజా ఘటనలతో ఎలక్ట్రిక్ బైక్ కొనడం అంటే, బాంబుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..