మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. వీఎల్‌ఎఫ్ టెన్నిస్ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఈ స్కూటీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంతో తెలుసుకుందాం.
వీఎల్‌ఎఫ్ టెన్నిస్ స్కూటర్‌లో 2.5 kWh బ్యాటరీని అందించారు. ఈ స్కూటీ 157 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీలు దూసుకెళ్తుంది.
స్కూటీ కేవలం మూడు గంటల్లోనే 100 శాతం ఛార్జింగ్ అవుతుంది. స్కూటీ గరిష్టంగా 100 కి.మీల వేగంతో దూసుకుపోవడం విశేషం.
ఈ స్కూటీ బరువు 88 కిలోల బరువు ఉంటుంది. స్నోఫ్లేక్ వైట్, ఫైర్ ప్యూరీ డార్క్ రెడ్, స్లేట్ గ్రే కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్కూటీకి రెండు డిస్క్ బ్రేక్‌లను అందించారు. ఇక స్కూటీకి ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, వెనుక హైడ్రాలిక్ మోనో-షాక్ సస్పెన్షన్ ఇచ్చారు.
అలాగే ఇందులో 5 ఇంచెస్‌తో కూడిన టీఎఫ్‌టీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇందులో బ్యాటరీ ఛార్జింగ్ ఇండికేషన్, ఎలక్ట్రిక్ సమస్యలను డిస్‌ప్లే అవుతాయి.
ఇక ఈ స్కూటీలో 2.8 kwh వేరియంట్‌ను కూడా ఇచ్చారు. ఈ స్కూటీ గంటకు 100 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది.