News9 Global Summit: ‘భారత్‌-జర్మన్‌ సంబంధాల్లో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది’.. ప్రధాని మోదీ

జర్మనీలో జరగుతున్న న్యూస్‌9 గ్లోబల్‌ సమిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఇండియా -జర్మనీ సంబంధాల్లో నేడు కొత్త అధ్యయనం ప్రారంభమైందని అన్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీ ప్రసంగించారు..

News9 Global Summit: 'భారత్‌-జర్మన్‌ సంబంధాల్లో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది'.. ప్రధాని మోదీ
Prime Minister Modi
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2024 | 9:58 PM

టీవీ9 నెట్‌వర్క్‌ జర్మనీలో నిర్వహిస్తున్న న్యూస్‌9 గ్లోబల్‌ సమిట్‌లో ప్రధాని మోదీ శుక్రవారం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండో-జర్మన్‌ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం టీవీ9 చేపట్టినందుకు మోదీ అభినందనలు తెలిపారు. జర్మనీ గురించి తెలుసుకునేందుకు ఇది ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. మోదీ ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘జర్మనీ, జర్మన్ ప్రజలను కనెక్ట్ చేయడానికి భారతీయ మీడియా గ్రూప్ పని చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. జర్మనీ మా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి. నేడు ప్రపంచంలోని ప్రతి దేశం భారత్‌తో భాగస్వామ్యం కలిగి ఉండాలని కోరుకుంటోంది. భారతదేశ ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి. ఇండో-జర్మనీ భాగస్వామ్యానికి నేటికి 25 సంవత్సరాలు. భారత్‌ను ప్రత్యేక దేశంగా జర్మనీ పరిగణిస్తోంది. ‘ఫోకస్ ఆన్ ఇండియా’ పత్రాన్ని జర్మనీ విడుదల చేసింది. ప్రస్తుతం జర్మనీ దేశంలో దాదాపు 3 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇక అలాగే భారతదేశంలో కూడా 1800లకు పైగా జర్మనీ కంపెనీలు పనిచేస్తున్నాయి. రానున్న కాలంలో భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. జర్మనీ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ పత్రం దీనికి చిహ్నం’.

‘రెండు దేశాల మధ్య 34 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. గడిచిన కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య వ్యాపారం మరింత బలపడుతోంది. నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా మారుతుంది. భారతదేశం ప్రతీ రంగంలో కొత్త విధానాలు అమలు చేస్తోంది. రెడ్‌ టేపిజం తొలగించాం. ఈజ్‌ ఆఫ్ బిజినెస్‌ పెంచాం.. బ్యాంకులన్నీ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వికసిత్‌ భారత్‌ కోసం గొప్ప నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ కేంద్రంగా మారుతోంది. మా తయారీ రంగంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ కేంద్రంగా మారుతోంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌ తయారీలో ప్రపంచంలోనే అతి పెద్దదేశం భారత్‌. నాలుగో అతి పెద్ద ఫోర్‌ వీలర్‌ తయారీ కేంద్రం కూడా భారత్‌’ ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో భారత్- జర్మనీ సత్సంబంధాల గురించి వివరించారు.

కాగా భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్‌‌ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.. ఈనెల 21వ తేదీన ప్రారంభమైన ఈ సమ్మిట్‌ 23వ తేదీ వరకు ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. గత ఫిభ్రవరిలో న్యూస్‌ 9 ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఇండియా-జర్మనీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జర్మనీలో కూడా సదస్సును నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.