AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాత్రివేళ యువతి అదృశ్యం.. కథలో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్ కట్ చేస్తే..

Andhra Pradesh: ఆ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమె అడిగిన ఓ చిన్న మాట వారిద్దరి మధ్య పెద్ద గొడవగా మారింది. కట్ చేస్తే..

Andhra Pradesh: రాత్రివేళ యువతి అదృశ్యం.. కథలో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్ కట్ చేస్తే..
Lovers Incident
Ravi Kiran
|

Updated on: Dec 06, 2022 | 8:42 AM

Share

ఆ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమె అడిగిన ఓ చిన్న మాట వారిద్దరి మధ్య పెద్ద గొడవగా మారింది. కట్ చేస్తే రాత్రివేళ యువతి అదృశ్యం అయింది. ఇంకేముంది రంగంలోకి పోలీసులు.. యువకుడి పొంతలేని సమాధానాలు.. ఎట్టకేలకు యువతి సురక్షితం.. కథ సుఖాంతం.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకోగా.. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన యువకుడు, రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంకు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. డిసెంబర్ 3వ తేదీ రాత్రి ఈ ఇద్దరూ బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో తుంగపాడు బస్టాండ్ సమీపంలోని సుబాబుల్ తోటల వద్ద యువతి బైక్ దిగి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న గొడవ కాస్తా పెద్ద వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఆ యువతి సుబాబుల్ తోటల్లోకి పరారై దెబ్బకు మాయమైంది. తోటల్లో యువకుడు ఎంతసేపు వెతికినా ఆమె దొరకలేదు. ఒకవైపు భయం.. మరోవైపు ఏం చేయాలో తెలియని సతమతం.. ఆ యువకుడు కాస్తా యువతిని ఎవరో కిడ్నాప్ చేసి సుబాబుల్ తోటల్లోకి లాక్కెళ్లారని అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులకు చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నరసరావుపేట డీఎస్పీ, రూరల్ సీఐ, ఎస్ఐ ఘటనాస్థలికి చేరుకొని తమ సిబ్బందితో కలిసి సుబాబుల్ తోట అంతా వెతికారు. ఎంత వెతికినా ఏం ప్రయోజనం లేకపోయింది.

ఇక ఆ యువకుడు ఓ దశలో తానే యువతిని చంపి హత్య చేశానని చెప్పడంతో.. పోలీసులు రాత్రంతా మృతదేహం ఆచూకీ కోసం వెతికారు. అయినా ఏం దొరకలేదు. ఏ ప్రశ్న అడిగిన యువకుడి నుంచి పదేపదే పొంతలేని సమాధానాలు వస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలికి అడగ్గా.. యువకుడి నుంచి అసలు విషయం బయటపడింది. అటు తన కోసం సబూబల్ తోటల్లో వెతుకుతున్నారని యువతికి తెలియడంతో.. ఆమె నేరుగా డీఎస్పీకి ఫోన్ చేసి తానే పోలీస్ స్టేషన్‌కు వస్తానని సమాచారం ఇచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డిసెంబర్ 4న ఆదివారం స్టేషన్‌కు వచ్చిన యువతి రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. యువతీయువకులు ఇద్దరూ తాము పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. వారి తల్లిదండ్రులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం