Andhra Pradesh: ఏపీకి తుపాను హెచ్చరిక.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం దిశగా పయణిస్తున్న ఈ అల్పపీడన ద్రోణి సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.

Andhra Pradesh: ఏపీకి తుపాను హెచ్చరిక.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Ap Rains
Follow us

|

Updated on: Dec 06, 2022 | 7:32 AM

బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం అంచనా తప్పి బలపడనుంది. తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా పడనుంది. ఇక దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం దిశగా పయణిస్తున్న ఈ అల్పపీడన ద్రోణి సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.కాగా ఈ తుపానుకు మాండూస్‌ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను.. ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుంది.

మాండూస్ గా నామకరణం..

ఇక  బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..