Ganja Farming: పేరటి మొక్కల మధ్యనే చీకటి యవ్వారం.. సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు..

గంజాయి గుప్పుమంటోంది. పొడి..తడి..లిక్విడ్‌ నానా రూపాల్లో సరిహద్దులు దాటేస్తోంది సరుకు. ఎంత నిఘా పెట్టిన గంజాయి మాఫియాకు మాత్రం కళ్లెం పడటంలేదు.

Ganja Farming: పేరటి మొక్కల మధ్యనే చీకటి యవ్వారం.. సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు..

|

Updated on: Dec 06, 2022 | 8:58 AM


గంజాయి గుప్పుమంటోంది. పొడి..తడి..లిక్విడ్‌ నానా రూపాల్లో సరిహద్దులు దాటేస్తోంది సరుకు. ఎంత నిఘా పెట్టిన గంజాయి మాఫియాకు మాత్రం కళ్లెం పడటంలేదు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో గుప్పుమంటోంది. మత్తు పదార్థాలకు యువకులు బానిసలుగా మారుతున్నారు. గంజాయి దొరకడం టఫ్ అవ్వడంతో.. ఇళ్లలోనే పెంచుతున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారుల మూకుమ్మడి దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు స్మగర్లు, గంజాయి మత్తు గాళ్లు.. ఇళ్లల్లోనే దుకాణం పెట్టేస్తున్నారు. పెరట్లోనే గంజాయిని పూల మొక్కల్లా పెంచేస్తున్నారు. తాజాగా మార్కాపురం పట్టణంలో ఓ ఇంట్లో పోలీసులు గంజాయి మొక్కల్ని గుర్తించడం కలకలం రేపింది. బాపూజీ కాలనీలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం కావడంతో సిబ్బందితో కలిసి దాడి చేయగా గంజాయి మొక్కలు వెలుగు చూశాయి. దాసరి దానమ్మ, దాసరి పేరయ్య ఇంట్లో సాగు చేస్తున్న మూడు గంజాయి మొక్కలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కనిగిరి శివ అనే ప్రధాన నిందితుడు పోలీసుల రాకతో పరారయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us