AP Weather: వామ్మో.. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఏపీలో 3 రోజులు కుండపోత వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం.. ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రాలోని పలు జిల్లాలో వర్షం దంచికొట్టనుంది.

AP Weather: వామ్మో.. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఏపీలో 3 రోజులు కుండపోత వర్షాలు..
Cyclone
Follow us

|

Updated on: Dec 07, 2022 | 3:38 PM

ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి.  హెవీ రెయిన్ అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో 15 కి. మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి డిసెంబర్ 7 ఉదయం ఎనిమిదిన్నర గంటలకు నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా శ్రీలంకకి తూర్పున 500 కి.మీ, తూర్పు ఆగ్నేయ జాఫ్నా(శ్రీలంక) కు దాదాపు 690 కి.మీ,  కారైకాల్‌కు 770 కి.మీ… దూరంలో తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా డిసెంబర్ 07 సాయంత్రానికి తుఫానుగా మారి  ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాలను డిసెంబరు 08 ఉదయం నాటికి చేరుకుంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు తదుపరి 48 గంటలు కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 8 తేదీ నుంచి 3రోజుల పాటు.. తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలపై వర్షాలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :-

ఈ రోజు :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు :-తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది

రేపు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కి మీ గరిష్టము గా 70 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి : – తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 70 -80 కి మీ గరిష్టము గా 90 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

ఈ రోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కి మీ గరిష్టము గా 70 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 70 -80 కి మీ గరిష్టము గా 90 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే