AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: అడ్డంగా దొరికిపోయిన క్రికెట్ బుకీ.. ఒకప్పటి ఎర్రచందనం స్మగ్లర్! అంతా కోడ్ లాంగ్వేజ్‌లోనే..

నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట విశ్వనాథరెడ్డి.. పాత నేరస్థుడు. గతంలో చందనం స్మగ్లింగ్‌తో పాటు పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడు. అడవి శాఖ అధికారులపై దాడికి యత్నం కూడా చేసినట్టు చెబుతున్నారు. నెల్లూరు వివి నగర ప్రాంతానికి చెందిన మాగుంట విశ్వనాథరెడ్డి.. పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నెల్లూరులో ఉంటూ రాయలసీమ జిల్లాల్లో నేరాలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు.. కాస్త రూట్ మార్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్కు బదులు క్రికెట్ బెట్టింగ్ల వైపు దృష్టి సారించాడు. ఇక.. నెల్లూరు నుంచి విశాఖకు మకాం..

Vizag: అడ్డంగా దొరికిపోయిన క్రికెట్ బుకీ.. ఒకప్పటి ఎర్రచందనం స్మగ్లర్! అంతా కోడ్ లాంగ్వేజ్‌లోనే..
Vizag Cricket Betting Gang
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 02, 2023 | 12:23 PM

Share

నెల్లూరు, నవంబర్‌ 2: వాడో ఎర్ర చందనం స్మగ్లర్. ఉండేది నెల్లూరులో.. నేరాలు రాయలసీమలో..! కానీ ఇప్పుడు మాకాం మార్చాడు.. నేరాల రూటు కూడా మార్పు చేసాడు. ఇప్పుడు వాడు చేసేది స్మగ్లింగ్ కాదు.. క్రికెట్ బెట్టింగ్. స్మగ్లర్ నుంచి బుకీ గా మారి.. నెటవర్క్ నడిపేస్తున్నాడు. క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో గుట్టుగా బెట్టింగ్ సెటప్ చేసి విశాఖ పోలీసులకు చిక్కిపోయాడు.

నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట విశ్వనాథరెడ్డి.. పాత నేరస్థుడు. గతంలో చందనం స్మగ్లింగ్‌తో పాటు పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడు. అడవి శాఖ అధికారులపై దాడికి యత్నం కూడా చేసినట్టు చెబుతున్నారు. నెల్లూరు వివి నగర ప్రాంతానికి చెందిన మాగుంట విశ్వనాథరెడ్డి.. పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నెల్లూరులో ఉంటూ రాయలసీమ జిల్లాల్లో నేరాలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు.. కాస్త రూట్ మార్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్కు బదులు క్రికెట్ బెట్టింగ్ల వైపు దృష్టి సారించాడు. ఇక.. నెల్లూరు నుంచి విశాఖకు మకాం మార్చేశాడు.

క్రికెట్ వరల్డ్ కప్ టార్గెట్గా బెట్టింగ్..

క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో.. విశాఖలో వాలిపోయిన ఈ మాగుంట విశ్వనాథరెడ్డి.. చీపురుపల్లి కి చెందిన లండ రామకృష్ణ, నెల్లూరుకు చెందిన ఎస్కే సంధాని భాష లను అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడు. విశాఖలోని బిర్లా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఎంచక్క గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో నడిపించేస్తున్నాడు. కాయ్ రాజా కాయ్ అంటూ లక్షల్లో వ్యవహారం చక్కబెట్టేస్తున్నాడని అన్నారు సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్.

ఇవి కూడా చదవండి

కోడ్ లాంగ్వేజ్ తోనే అంతా..

మాగుంట విశ్వనాథరెడ్డి ప్రధాన బుకిగా వ్యవహరిస్తున్నాడు. క్రిక్ ఎక్స్చేంజిలో చూపిన రేటింగ్ ఆధారంగా లైన్ గురు అప్లికేషన్ తో బెట్టింగ్ వ్యవహారాలు నడిపించేస్తున్నారు. ప్లే, ఈట్ అనే కోడ్ లాంగ్వేజ్ ల ద్వారా కార్యకలాపాలో నిర్వహిస్తున్నారు. పంటర్లకు తక్కువ లాభం వచ్చేలా.. నిర్వాహకులు ఓడిపోయినప్పటికీ ఎక్కువ లాభం వచ్చేలా ప్లాన్ చేసుకొని సంపాదిస్తున్నారు. ఇలా రోజు లక్షల్లో వ్యవహారం చెక్కబెట్టేస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ కు అందిన సమాచారంతో..

వరల్డ్ కప్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగులపై కుపీ లాగిన పోలీసులకు.. కీలక సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు బిర్లా జంక్షన్ వద్ద ఇంటిపై దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా ముగ్గురు పొట్టుబడిపోయారు. వారి నుంచి సెల్ ఫోన్లు లాప్టాప్ లతో పాటు బెట్టింగ్ కు వినియోగించే ఎక్యుప్మెంట్‌ను సీజ్ చేశామని డీసీపీ శ్రీనివాసరావు అన్నారు.

మళ్ళీ కస్టడికి..?

ప్రధాన నిండితుడు మాగుంట విశ్వనాథరెడ్డికి.. చాలామంది తోనే వ్యవహారాలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. బెంగళూరు నెల్లూరు లతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరికి లింకులు ఉన్నాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అయితే మా గుంట విశ్వనాథరెడ్డిని మరోసారి కష్టడీకి తీసుకొని సిద్ధమయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.