AP Municipal Elections: ఏపీలో మరోసారి ఎన్నికల సందడి.. కసరత్తు మొదులుపెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం!
టీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వివిధ కారణాలతో సభ్యులు మృతి చెందిన 8 పురపాలక, నగర పంచాయతీల్లోని పలు వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 పురపాలక, నగర పంచాయతీల్లో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వివిధ కారణాలతో సభ్యులు మృతి చెందిన 8 పురపాలక, నగర పంచాయతీల్లోని పలు వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సవరించిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని పురపాలకశాఖను ఎన్నికల సంఘం కమిషనరు ఆదేశించారు.
ఇటీవల రాష్ట్రంలోని 75 పురపాలక, నగర పంచాయతీలు, 12 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. కోర్టు వివాదాలు, ఇతర కారణాలతో నిర్వహించలేని చోట్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కమిషనరు నీలం సాహ్ని ఇటీవల పురపాలకశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిలిచిపోయిన మున్సిపాలిటీలు.. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, పెనుకొండ
Read Also… ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే!