AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే!

ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఓబీసీ జాబితాను తయారు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు ఈ బిల్లుతో పూర్తి స్వేచ్చ లభిస్తుంది.

ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే!
Obc Bill In Lok Sabha
Balaraju Goud
|

Updated on: Aug 10, 2021 | 7:42 PM

Share

127th Constitution Amendment OBC Bill: ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఓబీసీ జాబితాను తయారు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు ఈ బిల్లుతో పూర్తి స్వేచ్చ లభిస్తుంది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. లోక్ సభలో ఓబీసీ కోటాకు సంబంధించి ప్రవేశపెట్టిన రాజ్యాంగ 127వ సవరణ బిల్లు 2021ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టింది. నిన్ని ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలకు లభించనుంది. ఈ బిల్లుకు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. గతంలో చేసిన తప్పులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దుకుందని కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. అలాగే, మరాఠా రిజర్వేషన్లపైనా కేంద్రం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

టీఆర్ఎస్, బీజేడీ, ఎల్‌జేపీ, జేడీయూ ఈ బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశాయి. హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో రిజర్వేషన్ల సమస్యను ఇది పరిష్కరిస్తుందని లోక్‌సభ సభ్యులు అభిప్రాయపడ్డారు. మరోవైపు, శివసేన ఎంపీ వినాయక్ రౌత్ మరాఠాల రిజర్వేషన్లపై గళం వినిపించారు. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిందిగా వైసీపీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్ పార్టీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ.. పెగాసస్ మీద కూడా చర్చకు ఒప్పుకొంటే ఇప్పుడు జరుగుతున్నట్టే సమావేశాలు సాఫీగా సాగుతాయని అన్నారు.

ఓబీసీల రిజర్వేషన్ల కోసం డీఎంకే పోరాడిందని ఆ పార్టీ ఎంపీ బాలు గుర్తు చేశారు. మరోవైపు, ఓబీసీలకు కాంగ్రెస్ ఎలాంటి రిజర్వేషన్లను ఇవ్వలేదని, కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గుర్తు చేశారు. దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఓబీసీల క్రిమిలేయర్ పరిమితిని పెంచారని వ్యాఖ్యానించారు.

Read Also… National Anthem: ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎప్పుడు స్వీకరించారో తెలుసా..?.. చరిత్ర ఏమిటి..?