AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Speaker: అయినా చంద్రబాబు మారలేదు.. అలిపిరి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని..

Andhra Pradesh Speaker: టీడీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం..

Andhra Pradesh Speaker: అయినా చంద్రబాబు మారలేదు.. అలిపిరి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని..
Shiva Prajapati
|

Updated on: Jan 04, 2021 | 12:26 PM

Share

Andhra Pradesh Speaker: టీడీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దేవుళ్ల జోలికి వెళ్లి తప్పుడు ఆరోపణలు చేయడం వల్లే అలిపిరి వద్ద చంద్రబాబు ప్రమాదానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. అంత జరిగినా ఆయనలో మార్పు రాలేదని విమర్శించారు. సోమవారం నాడు పొందూరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలను సైతం రాజకీయం చేయడం, ఆ ముసుగులో లబ్ధి పొందాలని చూడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వరుస ఘటనలకు కారణమైన వారిని పట్టుకుని, దీనిపై రాద్ధాంతం చేస్తున్న వారికి తగిన సమాధానం ఇవ్వాలన్ని ప్రభుత్వాన్ని, ముఖ్యంత్రిని తాను కోరినట్లు తమ్మినేని సీతారాం తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా హిందూ దేవతలకు చెందిన విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నారు. ఈ వరుస ఘటనలు ఏపీలో పెను రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రభుత్వం ప్రోద్బలంతోనే విగ్రహాల ధ్వంసం కార్యక్రమం జరుగుతోందంటూ విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే, విగ్రహాల ధ్వంసానికి కారణం విపక్ష నేతలే అంటూ ప్రభుత్వ పెద్ద ఎదరుదాడికి దిగారు. ఇలా ఇరు పక్షాల పరస్పర ఆరోపణలతో ఏపీ రాజకీయం తారాస్థాయికి చేరింది.

Also read:

Aishwarya In HYD: భాగ్యనగరంలో తళుక్కుమన్న మాజీ ప్రపంచ సుందరి.. భర్త, కూతురుతో కలిసి..

Indian Badminton Team: బ్యాంకాక్ బయలుదేరిన భారత బ్యాడ్మింటన్ బృందం… జనవరి 12 నుంచి 17 వరకు టోర్నీ