Tadipatri High Tension live updates : జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్ష .. తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కొనసాగుతున్న 144 సెక్షన్

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jan 04, 2021 | 1:21 PM

అనంతపురం తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.   జేసీ బ్రదర్స్ నేడు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని

Tadipatri High Tension live updates : జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్ష .. తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కొనసాగుతున్న 144 సెక్షన్

అనంతపురం తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.   జేసీ బ్రదర్స్ నేడు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తాహశీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరుల ఆమరణ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. ఉదయం జేసీ బ్రదర్స్ , ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఇంటిదగ్గర పోలీసులు కవాతు నిర్వహించారు. సభలు, సమావేశాలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. తాడిపత్రికి నాలుగువైపులా వచ్చే మార్గాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన వీధుల్లో దుకాణాలను బంద్ చేయిస్తున్నారు.మరో వైపు పోలీసులు అరెస్ట్ చేసిన దీక్షచేస్తామంటన్నారు జేసీ బ్రదర్స్.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jan 2021 12:18 PM (IST)

    తాడిపత్రిని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు…

    జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దనే దీక్షను కొనసాగిస్తున్నారు. దాంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాన్ని మొత్తం తమ గుప్పేట్లోకి తీసుకున్నారు. దాంతో పాటు చుట్టూ ప్రక్కల 20 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలో ఉంచుకున్నారు. ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్త్ ను ఏర్పాటు చేసారు.

  • 04 Jan 2021 12:14 PM (IST)

    ఆరోగ్యం సహకరించకపోయినా  దీక్ష కొనసాగిస్తా..

    నాకు ఓపిక ఉన్నంతవరకు దీక్ష కొనసాగిస్తా అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా  దీక్షను  కొనసాగిస్తున్నారు. ‘నేను నడవలేని పరిస్థితిలో ఉన్న… ఇటీవలే ఆపరేషన్ జరిగింది. కోవిడ్ కారణంగా అది మళ్ళీ రియాక్ట్ అయ్యాయంది. అయినా సరే దీక్ష కొనసాగిస్తా’ అంటున్నారు జేసీ.

  • 04 Jan 2021 12:10 PM (IST)

    ప్రజలతో ఎలా మాట్లాడాలో నాకు ఓ లాయర్ ట్రైనింగ్ ఇచ్చారు : జేసీ

    జైల్లో ఒక లాయర్ నాకు ట్రైనింగ్ ఇచ్చాడు ప్రజలతో ఎలా మాట్లాడాలి, టీవీ వాళ్ళతో ఎలా మాట్లాడాలని ట్రైనింగ్ ఇచ్చారు. నేను చాలా మారిపోయాయి అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

  • 04 Jan 2021 12:08 PM (IST)

     తహశీల్దార్ కార్యాలయాన్ని లాక్ చేసి పెట్టుకున్నారు : జేసీ

    తహశీల్దార్ కార్యాలయాన్ని లాక్ చేసి పెట్టుకున్నారు.ఎందుకు ఎంత దిగజారుతున్నారు. ఇది చాలా దారుణం అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసులు అక్కడికి పోనివ్వలేదు అందుకే ఇక్కడే ఇంటిదగ్గర ఉంది దీక్ష చేస్తున్నా అన్నారు జేసీ.

  • 04 Jan 2021 12:04 PM (IST)

    ఆరోగ్యం సహకరించకపోయినా దీక్ష కొనసాగిస్తానంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

    ఆరోగ్యం సహకరించకపోయినా దీక్ష కొనసాగిస్తానంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం తో ఇంటి దగ్గరే ఉంది దీక్ష చేస్తున్నారు.

  • 04 Jan 2021 11:54 AM (IST)

    నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..

    ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తాడిపత్రికి నాలుగువైపులా వచ్చే మార్గాల్లో పోలీసులు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రధాన వీధుల్లో దుకాణాలను బంద్‌ చేయిస్తున్నారు.

  • 04 Jan 2021 11:36 AM (IST)

    తాడిపత్రికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు. 

    పోలీసులకు భయపడేది లేదంటున్న జేసీ బ్రదర్స్ .. ఎట్టి పరిస్థితుల్లో దీక్ష చేస్తామంటున్నారు. మరోవైపు దీక్ష జరగకుండా అడ్డుకుంటామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు .

  • 04 Jan 2021 11:32 AM (IST)

    తహశీల్ధార్ కార్యాలయానికి వెళ్లిన ప్రభాకర్  రెడ్డి భార్య ఉమ్మారెడ్డి. అడ్డుకున్న పోలీసులు..

    జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ క్రమంలో తహశీల్ధార్ కార్యాలయానికి ప్రభాకర్  రెడ్డి భార్య ఉమ్మారెడ్డి వెళ్లారు. అయితే ఆమె కారులో నుంచి కిందకు దిగకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను తీసుకువెళ్లి ఇంటిదగ్గర వదిలేశారు పోలీసులు. దాంతో ఆమె అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు.

  • 04 Jan 2021 11:15 AM (IST)

    జేసీ సోదరుల ఇంటి వద్ద ఉదయం నుంచి భారీగా చేరుకున్న పోలీసులు..

    ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా తాహశీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరులు ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే జేసీ బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసేందుకు ఉదయం నుంచే భారీగా పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. దీక్షకు బయలుదేరిన జేసీ దివాకర్ రెడ్డిని, జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

  • 04 Jan 2021 11:08 AM (IST)

    తాడిపత్రిలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం.. జేసీ బ్రదర్స్ ను అడ్డుకున్న పోలీసులు

    తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే జేసీ బ్రదర్స్ ను అడ్డుకున్నారు పోలీసులు. ర్యాలీలు, దీక్షలకు, సభలకు అనుమతులు లేవని పోలీసులు చెప్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీక్షకు బయలుదేరిన జేసీ బ్రదర్స్ ను అడ్డుకోవడంతో  ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

  • 04 Jan 2021 11:01 AM (IST)

    దీక్షకు బయలుదేరిన ప్రభాకర్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు.. ఇంటి ముందు బైఠాయింపు

    తాడిపత్రిలో హైడ్రామా.. దీక్షకు వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఇంటినుంచి బయటకు వచ్చిన ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు అడ్డుకున్నారు. దాంతో  ఇంటి ముందు బైఠాయించారు ప్రభాకర్ రెడ్డి.

  • 04 Jan 2021 10:54 AM (IST)

    కొనసాగుతున్న ఆంక్షలు.. తాడిపత్రి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

    తాడిపత్రిలో కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు.. కొనసాగుతున్న 144 సెక్షన్. తాడిపత్రిలో భారీగా మోహరించిన పోలీసులు. తాడిపత్రి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు.

  • 04 Jan 2021 10:24 AM (IST)

    జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిదగ్గరకు భారీగా  చేరుకున్న పోలీసులు

    కాసేపట్లో దీక్ష చేపట్టనున్న జేసీ బ్రదర్స్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిదగ్గరకు భారీగా  చేరుకున్న పోలీసులు . బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న పోలీసులు.

  • 04 Jan 2021 10:22 AM (IST)

    ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన జేసీ దివాకర్ రెడ్డి

    జేసీ దివాకర్ రెడ్డికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన జేసీ దివాకర్ రెడ్డి. అడ్డుకున్న పోలీసులు. దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

  • 04 Jan 2021 10:18 AM (IST)

    తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. జేసీ సోదరులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు

    తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారంటూ.. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద.. జేసీ ప్రభాకర్‌రెడ్డి మౌనదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పోలీసులు జేసీ సోదరులను గృహ నిర్బంధం చేశారు. జేసీ దివాకర్‌ రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని స్వగృహంలో నిర్బంధించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

  • 04 Jan 2021 10:16 AM (IST)

    జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే పెద్ద రెడ్డ్ ఇంటిదగ్గర భారీగా పోలీసులు

    జేసీ బ్రదర్స్ ఇంటిదగ్గర భారీగా చేరుకున్న పోలీసులు . అటు ఎమ్మెల్యే పెద్ద రెడ్డి ఇంటిదగ్గర కూడా భారీగా పోలీసులను మోహరించారు. ర్యాలీలు కానీ , దీక్షలు , సభలను అనుమతించమని పోలీసులు చెప్తున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జేసీ బ్రదర్స్ సిద్ధంగా ఉన్నారు.

  • 04 Jan 2021 10:12 AM (IST)

    జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..

    తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..  ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటినుంచి బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు

  • 04 Jan 2021 10:08 AM (IST)

    మరి కాసేపట్లో జేసీ బ్రదర్స్ నిరాహార దీక్ష.. అప్రమత్తమైన పోలీసులు..

    జేసీ బ్రదర్స్ , ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఇంటివద్ద పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. జేసీ బ్రదర్స్ నిరాహారదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీగా పోలీసులను మోహరించారు. వెంటనే 144 సెక్షన్ ను విధించారు పోలీసులు.

  • 04 Jan 2021 10:03 AM (IST)

    పోలీసులకు భయపడేది లేదు.. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామంటున్న జేసీ బ్రదర్స్

    పోలీసులకు భయపడేది లేదు. ఏదిఏమైనా దీక్ష చేసి తీరతామంటున్న జేసీ బ్రదర్స్. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. చావో రేవో తేల్చుకుందామని 70 ఏళ్ళ పైబడిన వారు కూడా దీక్షకు కదిలి రావాలని కోరారు జేసీ దివాకర్ రెడ్డి

  • 04 Jan 2021 09:48 AM (IST)

    తాడిపత్రిలో అడుగడుగునా పోలీసులు.. కొనసాగుతున్న 144 సెక్షన్

    తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. తాడిపత్రిలో అడుగడుగునా పోలీసులు ఉన్నారు. ప్రధాన ప్రాంతాల్లో దుకాణాలను పోలీసులు మూసేపించారు. బయటవారిని గ్రామంలోకి అనుమతించడం లేదు పోలీసులు.

  • 04 Jan 2021 09:38 AM (IST)

    మేము టీడీపీ లో స్ట్రాంగ్ ఉన్నాం.. ఫైనాన్షియల్ గా దెబ్బతీసి పార్టీ మారమంటే మేము మారం జేసీ ప్రభాకర్ రెడ్డి. 

    ఎన్టీఆర్ టైం లను నన్ను పీడీయాక్ట్ లో పెట్టారన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి . మేము స్ట్రాంగ్ గా టీడీపీలో ఉన్నాం.. మేము వీక్ కాదు కష్టపడి పైకి వచ్చినవాళ్ళం.. మేము ప్రభుత్వాన్ని ఏమీ కోరలేదు. మమ్మలిని ఫైనాన్షియల్ గా దెబ్బతీసి పార్టీ మారమంటే మేము మారం జేసీ ప్రభాకర్ రెడ్డి.

Published On - Jan 04,2021 12:28 PM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu