Singarayakonda: యువతితో ప్రేమ నటించి ఫొటోలు దిగాడు.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్! ఖాఖీల ఎంట్రీతో
సోషల్ మీడియాలో రకరకాల యాప్‌లద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ, స్నేహం నటిస్తూ ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి అనంతరం యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ పరిచయం లేని వ్యక్తులు ఫేస్ బుక్ ద్వారా, షేర్ చాట్ యాప్‌ల ద్వారా అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకొని, వారి అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాలలో పంపునంటూ వేధించి డబ్బులు గుంజుతున్న ఉదంతాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన ప్రకాశంజిల్లాకు చెందిన యువతికి ఎదురైంది. షేర్‌చాట్..

సింగరాయకొండ, అక్టోబర్ 18: సోషల్ మీడియాలో రకరకాల యాప్‌లద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ, స్నేహం నటిస్తూ ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి అనంతరం యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ పరిచయం లేని వ్యక్తులు ఫేస్ బుక్ ద్వారా, షేర్ చాట్ యాప్‌ల ద్వారా అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకొని, వారి అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాలలో పంపునంటూ వేధించి డబ్బులు గుంజుతున్న ఉదంతాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన ప్రకాశంజిల్లాకు చెందిన యువతికి ఎదురైంది. షేర్‌చాట్ యాప్‌ద్వారా పరిచయమైన ఓ యువతిని ఇలాగే ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన ఓ యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించి రూ.20 వేలు బలవంతంగా తీసుకోవడంతో మనస్థాపానికి గురైన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కృష్ణాజిల్లాకు చెందిన నిందితుడు లంకా రాజేష్ ను ప్రకాశంజిల్లా సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
కృష్ణాజిల్లా గుడ్ల వల్లూరు మండలం వేమవరం గ్రామానికు చెందిన లంకా రాజేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. చెడువ్యసనాలకు బానిసై రాజేష్ సోషల్ ద్వారా రకరకాల యాప్‌లలో చాట్ చేస్తూ అమ్మాయిలకు మెసేజ్ పంపిస్తుంటాడు. ఇతని ఫ్రెండ్ రిక్వెస్టలను యాక్సెప్ట్ చేసిన యువతులతో తరచూ చాట్ చేస్తూ, ఫోన్ ద్వారా పరిచయాలు పెంచుకొని, వాళ్ళను కలిసినప్పుడు బలవంతంగా ఫోటోలు దిగి, అవి చూపిస్తూ బెదిరించి, చిన్న చిన్న మొత్తాలలో డబ్బులు గుంజుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఈ డబ్బులతో జల్సాలు చేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో షేర్ చాట్ యాప్‌ద్వారా ప్రకాశంజిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తనతో చనువుగా ఉంటూ, అప్పుడప్పుడు ఆమెను కలుస్తూ వచ్చాడు. ఆ సమయంలో ఆమెతో కొన్ని ఫోటోలు దిగి, అవి చూపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, బంధువులకు పంపుతానని బెదిరించాడు. అలా పంపించకుండా ఉండాలంటే ఆమె డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ యువతి దగ్గర డబ్బులు తీసుకునేందుకు సింగరాయకొండలోని ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె గొంతు మీద కత్తి పెట్టి చంపుతాను అని బెదిరించి, ఆమె నుండి 20 వేలరూపాయలు బలవంతంగా డబ్బులు లాక్కొని వెళ్లాడు. తర్వాత కూడా పదే పదే ఫోన్ చేస్తూ డబ్బులు అడగడం ప్రారంభించాడు. లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, బందువులకు, సోషల్ మీడియా ద్వారా పంపుతానంటూ మళ్ళీ బెదిరించడం మొదలుపెట్టాడు. తన దగ్గర ఇక డబ్బులు లేవని ఆ యువతి మొరపెట్టుకున్నా వినలేదు రాజేష్ చివరకు ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో పాటు వాటి లింకులను యువతి బంధువులకు పంపించాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి సింగరాయకొండ పోలీసులను ఆశ్రయించింది… యువతి పిర్యాదును పరిశీలించిన జిల్లా ఎస్‌పి మలికగార్గ్ కేసును ప్రతిష్టత్మకంగా తీసుకుని తన స్వీయ పర్యవేక్షణలో ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే కోర్ కమిటీని రంగంలోకి దించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సింగరాయకొండ సిఐ రంగనాధ్ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో తగిన ఆధారాలు సేకరించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సిఐ రంగనాధ్, ఎస్‌ఐ శ్రీరామ్‌లను ఎస్‌పి మలికగార్గ్ అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




