Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు వికసిస్తుందా..? పవన్ కల్యాణ్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు.. వచ్చే ఎన్నికలకు దానికి తగ్గట్లుగా వ్యూహ రచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. చంద్రబాబు అరెస్టు అనంతరం.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని.. దాని ప్రకారమే ముందుకు వెళ్తామని కూడా ప్రకటించారు. అయితే, ఏపీతోపాటు తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించిన పవన్ కల్యాణ్.. జనసేనకు ఆదరణ ఎక్కువగా ఉన్న స్థానాలపై గురిపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు.. వచ్చే ఎన్నికలకు దానికి తగ్గట్లుగా వ్యూహ రచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. చంద్రబాబు అరెస్టు అనంతరం.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని.. దాని ప్రకారమే ముందుకు వెళ్తామని కూడా ప్రకటించారు. అయితే, ఏపీతోపాటు తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించిన పవన్ కల్యాణ్.. జనసేనకు ఆదరణ ఎక్కువగా ఉన్న స్థానాలపై గురిపెట్టారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించారు. ఇంతవరకూ తెలంగాణలో జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలపై ఏదొక కార్యక్రమం చేస్తూ జనసేన ముందుకు వెళ్తుంది.. ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో కమిటీలను నియమించిన జనసేన రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ ద్వారా జనసేన ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో పోటీతో ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..? పొత్తులు వంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకుంటున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. మరోవైపు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని కూడా నివేదికలు తెప్పించుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ జనసేన నేతలతో కూడా ఎప్పటికప్పుడు భేటీ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత రాష్ట్ర నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. పార్టీ క్యాడర్ 32 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నట్లు నాయకత్వం చెప్పడంతో.. దానికనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.
జీహెచ్ఎంసి పరిధిలో, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ప్రధానంగా జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 32 నియోజకవర్గాల జాబితాను కూడా సిద్దం చేసారు.. 32 నియోజకవర్గాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నట్లు పవన్ కు వివరించారు. 25 స్థానాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందని.. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో జనసేన ఓటింగ్ ఉందని రాష్ట్ర నేతలు అభిప్రాయపడటంతో.. పవన్ ఆ దిశగా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 32 స్థానాల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈసారి పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లేనని.. భవిషత్తులో ప్రజల ముందుకు బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేయడంతో.. పవన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. ఎన్డీఏ లో భాగస్వామ్య పార్టీ అయిన జనసేనకు.. బీజేపీ కూడా తమతో కలిసి పోటీ చేయాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తామని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా టీడీపీతో కలిసి వెళ్లే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ కల్యాణ్ తో టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.. తెలంగాణలో జనసేన, బీజేపీ ఉమ్మడి పోటీపై ముగ్గురూ ఈ సందర్భంగా చర్చించారు. అయితే, తెలంగాణ నాయకత్వం పోటీ చేయాలని పట్టుబడుతుందని.. దానికనుగుణంగా బలం ఉన్న సీట్లలో పోటీచేయనున్నట్లు పవన్ చెప్పినట్లు సమాచారం.. అంతేకాకుండా, గతంలో తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాలను కూడా పవన్ ప్రస్తావించారు.
రెండు రోజుల్లో తుది నిర్ణయం..
తెలంగాణలో పోటీ చేస్తే ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ఏపీలో వారాహి విజయయాత్రకు ఇబ్బంది ఉంటుందా..? అనే దానిపై కూడా పవన్ ఆలోచనలో పడినట్లు సమాచారం..అంతేకాకుండా.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే.. సీట్ల పంపకాలు, తదితర విషయాలను కూడా బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై బీజేపీ అభిప్రాయం ఎలా ఉండనుంది..? ఏకాభిప్రాయం కుదురుతుందా..? లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకోని.. రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నిర్ణయాన్ని వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
