ఓట్స్ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. ఈ నిజాలు తెలిస్తే షాకే..

Krishna

07 June 2026

ఓట్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని బీటా-గ్లూకాన్ అనే ప్రత్యేక ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్‌

ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కేవలం నీళ్లలోనో లేదా పాలలోనో ఉడికించి ఒంటరిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.

షుగర్ లెవెల్స్

ఓట్స్ తినేటప్పుడు బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే వాటికి ప్రోటీన్ తోడుగా ఇవ్వాలి. మీ ఓట్‌మీల్‌లో బాదం, జీడిపప్పు, గింజలు, గ్రీక్ యోగర్ట్ లేదా ప్రోటీన్ పౌడర్ కలుపుకుని తినడం చాలా మంచిది.

 ప్రోటీన్

చాలామంది ఓట్స్ టేస్ట్‌గా ఉండటం కోసం ఎక్కువ మొత్తంలో చక్కెర, తేనె లేదా మాపుల్ సిరప్ కలుపుతుంటారు. ఇవి శరీరంలో కేలరీలను విపరీతంగా పెంచి, ఇన్సులిన్ స్థాయిలను ల్యాగ్ చేస్తాయి.

పంచదార

 ఓట్స్ ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ, వీటిలో కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు అమితంగా తినేయకూడదు. ఎప్పుడైనా సరే వండే ముందు అర కప్పు పొడి ఓట్స్ కొలతను మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

నియంత్రణ ముఖ్యం

మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ లేదా ఫ్లేవర్డ్ ఓట్‌మీల్ ప్యాకెట్లు చాలా త్వరగా జీర్ణమైపోతాయి. పైగా వీటిలో కృత్రిమ రుచులు, కెమికల్స్, చక్కెర ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మంచి వాటినే ఎంపిక చేసుకోవాలి.

ఇన్‌స్టంట్ ఓట్స్‌

మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించాలంటే గుడ్ ఫ్యాట్స్ అవసరం. అందుకే ఓట్స్ టాపింగ్స్‌గా నట్ బట్టర్, విత్తనాలు లేదా అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి.

హెల్తీ కొవ్వులు

ఓట్స్‌ను సరైన పద్ధతిలో, సరైన కాంబినేషన్‌తో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శరీర బరువు అదుపులో ఉంటుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.

సూపర్ డోస్