Nandyala Kidnap Case: నంద్యాల కిడ్నాప్ కేసులో 15 మంది అరెస్ట్.. రూ.3 కోట్లు స్వాధీనం! స్కెచ్ మామూలుగా లేదుగా
వైజాగ్ ఎంపీ ఎమ్ వి.వి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనను తలదన్నేలా నంద్యాల జిల్లాలో ఓ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసి నాలుగు కోట్లు దోచుకున్న కేసులో 15 మందిని అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి మూడు కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. నంద్యాల జిల్లాలో అత్యంత సంచలన సృష్టించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కిడ్నాప్ కేసు నమోదు కావడం జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి..

నంద్యాల, అక్టోబర్ 20: వైజాగ్ ఎంపీ ఎమ్ వి.వి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనను తలదన్నేలా నంద్యాల జిల్లాలో ఓ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసి నాలుగు కోట్లు దోచుకున్న కేసులో 15 మందిని అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి మూడు కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. నంద్యాల జిల్లాలో అత్యంత సంచలన సృష్టించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కిడ్నాప్ కేసు నమోదు కావడం జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్టు చేసి కిడ్నాప్ చేసి దోచుకున్న డబ్బులను రికవరీ చెయ్యడంతో పాటు ముద్దాయిలను కటకటాల పాలు చేసి శభాష్ అనిపించుకున్నారు.
జూన్ 7వ తేదీన బనగానపల్లెకు చెందిన CH నాగిరెడ్డి అనే వ్యక్తి బేతంచెర్ల పోలీస్ స్టేషన్ లో 5వ తేదీ ఉదయం తన కొడుకు వినాయక రెడ్డి, తన మనవడు భరత్ కుమార్ రెడ్డి తన డ్రైవరు సాయినాథ్ రెడ్డి ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, రూ.4 కోట్లు డిమాండ్ చేశారంటూ కేసు పెట్టాడు. కిడ్నాపర్స్ కి బయపడిన నాగి రెడ్డి తనకు తెలిసిన వారి వద్ద నుంచి రూ.4 కోట్లు డబ్బులు తీసుకొని తన మేనల్లుడైన శంకర్ రెడ్డి ద్వారా రెండు విడతలుగా కిడ్నాపర్స్‌కు అందజేసినట్లు ఫిర్యాదులో తెలిపాడు.
బాదితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం నాలుగు బృందాలుగా కిడ్నాపర్స్ కోసం ముమ్మరంగా గాలించారు. పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనంతపురం, బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగుళూరు, కోలార్, మైసూరు, తుమ్కూర్, మొదలగు ప్రదేశాలలో కిడ్నాపర్స్ కోసం వెతికారు. గుత్తి మండల బాట సుంకులమ్మ గుడి వద్ద సురేశ్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని అతని సహాయంతో అనంతపురము జిల్లా చెన్నేకొత్తపల్లి మండలము, కోన మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళు రస్తాలో కర్నాటక రాష్ట్రనికి చెందిన శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, GN రంజిత్ కుమార్, ఏపీలోని అనంతపురం జిల్లాకి చెందిన రవి కుమార్, రంజిత్ కుమార్ లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.40 లక్షల నగదును కిడ్నాప్ కు ఉపయోగించిన నాలుగు కార్లు, మూడు సెల్ ఫోన్, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదే కేసులో ప్రదాన ముద్దాయిలు అయిన అనంతరపురం చెందిన నరేష్, భాస్కర్, కర్నాటక చెందిన రఘు అనే ముగ్గురు ముద్దాయిలను ఈ రోజు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.2.66 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అరెస్టు చేయగా.. వారి నుంచి రూ. 3.06 కోట్లు పోలీసులు రికవరీ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి కేసు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రధానంగా ఈ కేసులో మొదటి ముద్దాయి అయిన నరేష్ గతంలో ఫిర్యాది అయిన నాగిరెడ్డి వద్ద జెసిబి డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు. జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా త్వరగా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో కిడ్నాప్ పథకం వేశాడు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయిన నాగిరెడ్డి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తే కోట్లు సంపాదించ వచ్చని భావించి స్కెచ్ వేశారు. నరేష్ పక్కా రెక్కి నిర్వహించి కర్నాటకకు చెందిన కొందరి సహాయంతో ఈ కిడ్నాప్ చేసినట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




