Earthquake Visakhapatnam: విశాఖపట్నంలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనాలు..
Earthquake Visakhapatnam: విశాఖ నగరంలో భూప్రకంపనలు సంభవించాయి. నగరంలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో విశాఖ నగర వాసులు
Earthquake Visakhapatnam: విశాఖ నగరంలో భూప్రకంపనలు సంభవించాయి. నగరంలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో విశాఖ నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కయ్యపాలెం, మురళీనగర్, బీచ్ రోడ్డు, కంచరపాలెం, మధురానగర్, తాడిచెట్లపాలెం కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనకు గురైన జనాలు.. తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని కాసేపు టెన్షన్‌కు గురయ్యారు. దీనిపై అధికారులు స్పందించారు. సాధారణ భూప్రకంపనలే అని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు.
Also read:
T20 World Cup 2021: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆడమ్ జంపా.. ఫైనల్లో కూడా రాణిస్తాడా..
Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. బంగారం బాటలోనే సిల్వర్.. ఎంత పెరిగాయంటే..