T20 World Cup 2021: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆడమ్ జంపా.. ఫైనల్‌లో కూడా రాణిస్తాడా..
టీ20 ప్రపంచ కప్ 2021లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా వికెట్లు తీస్తూ ఆసీస్‌కు విజయాన్ని అందిస్తున్నాడు. గతంలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించినప్పటికీ తర్వాత అతడు ఫామ్ కోల్పోయాడు...
టీ20 ప్రపంచ కప్ 2021లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా వికెట్లు తీస్తూ ఆసీస్‌కు విజయాన్ని అందిస్తున్నాడు. గతంలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించినప్పటికీ తర్వాత అతడు ఫామ్ కోల్పోయాడు. దీంతో అతడిపై ఎలాంటి అంచనాలు లేనప్పటికీ జంపా రాణిస్తున్నాడు. సూపర్ 12 దశలో 11 వికెట్లు తీసి జట్టులో అత్యధికంగా 11 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియాకు జంపా ప్రధాన ఆటగాడిగా మారాడు. అతని జట్టు ఫ్రంట్‌లైన్ బౌలర్లలో అత్యుత్తమ ఎకానమీ రేటుతో ఉన్నాడు. “నన్ను తక్కువగా అంచనా వేశారు. ఈ టోర్నమెంట్ తర్వాత కూడా, మరొక సిరీస్ వస్తుంది. తనను మళ్లీ తక్కువ అంచనా వేస్తారు. కానీ నేను రాణిస్తాను” అని జంపా పేర్కొన్నారు.
మార్కస్ స్టోయినిస్ ఆడమ్ జంపాపై గొప్ప ప్రశంసలు కురిపించాడు. స్పిన్నర్ల ఉత్తమ బౌలర్లలో జంపా ఒకడని చెప్పాడు. “అతను తెలివైనవాడు. సెమీ-ఫైనల్‌లో పాకిస్తాన్ బాగా ఆడుతున్న దశలో అతని నాలుగు ఓవర్లు ఇన్నింగ్స్‌పై పూర్తి నియంత్రించాయి. జాంపా గురించి గొప్ప విషయం ఏమిటంటే అతను చాలా నిజాయితీపరుడు.” అని స్టోయినిస్ జోడించారు. జంపా ఫైనల్‌లో కూడా రాణించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాలని చూస్తున్నాడు. అటు న్యూజిలాండ్ కూడా గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో కవీస్ ఓడిపోయి కప్‌ను చేయి జార్చుకుంది. ఆ తర్వాత 2019 వరల్డ్ కప్‌లో కూడా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి కప్ కోల్పోయింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ గెలవాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.