Andhra Pradesh: ‘కూర్చుని ఉంటే ఒళ్లు పెరుగుతుంది’.. ఇలాంటి ఎమ్మెల్యే చాలా అరుదు గురూ..!
Andhra Pradesh: ఒక ఊరికి సర్పంచ్‌గా గెలిస్తేనే బైక్ వదిలి కార్లో తిరిగే రోజులు ఇవి. అలాంటిది ఇక శాసనసభ్యడిగా గెలిస్తే వారి..
Andhra Pradesh: ఒక ఊరికి సర్పంచ్‌గా గెలిస్తేనే బైక్ వదిలి కార్లో తిరిగే రోజులు ఇవి. అలాంటిది ఇక శాసనసభ్యడిగా గెలిస్తే వారి డాబు ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. చాలామంది నేతలు అధికార జులుం ప్రదర్శిస్తుంటారు. పుచ్చలపల్లి సుందరయ్యలా ఆర్టీసీ బస్సుల్లో తిరిగే వారు మచ్చుకైనా కనిపించడం లేదు. నాటి పుచ్చలపల్లి సుందరయ్యలా ఆర్టీసీ బస్సుల్లో తిరిగే వారు మచ్చుకైనా కనిపించడం లేదు. అధికార దర్పంతో.. పనికి ఆహార పథకంలో కూలిలను తమ పొలం పనులకు వినియోగించుకోవటంతో పాటు అగ్రికల్చర్, పశు సంవర్థకశాఖ అధికారులతో తమ పౌల్ట్రీ, పశు సంపద ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.
కాని ఇదిగో ఈయన పూర్తి విరుద్ధం. పుచ్చలపల్లి సుందరయ్యలా ఆర్టీసీ బస్సుల్లో తిరగకపోయినా.. అయనలాగే చర్యలు ఉంటాయి. టీషర్ట్, నైట్ ఫ్యాంట్‌తో సింగిల్ గా స్కూటీపై వెలుతారు. ఆయనే పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. కాన్షీరాం స్ఫూర్తితో దళిత, బహుజనుల సమస్యల పరిష్కారం కోసం యువకుడిగా తిరిగిన ఆయన తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా పార్టీ జెండా మోసిన తలారి.. తర్వాత వైఎస్ జగన్‌తో కలసి వైసీపీ కోసం పని చేశారు. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో 40వేల మెజార్టీతో టిడిపి కంచు కోటలాంటి గోపాలపురం నియోజకవర్గం నుంచి గెలిచారు.
అయితే గెలిచిన తర్వాత అసెంబ్లీ జరిగే రోజులు మినహా దేవరపల్లిలో ఉంటే చాలు రోజూ ఉదయం 5 గంటలకే తన స్కూటీపై మూడు కిలో మీటర్ల దూరంలోని యాదవోలు రోడ్డులో ఉన్న వ్యవసాయక్షేత్రానికి వెళతారు. అక్కడ ఉన్న ఆవులు, గేదెలకు పాలు స్వయంగా తీసి వాటిని అమూల్ డైరీకి పోస్తారు. గేదెలకు దాణా వేయటం, వాటి ఆలనా పాలన చూసుకుని కాపలాదారుడికి తగిన సలహాలు ఇచ్చి తిరిగి పౌల్ట్రీ లో కోళ్లకు మేత వేస్తారు. ఈ పనులు పూర్తయిన తర్వాత వివిధ రకాల సమస్యలతో వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటారు. శాసనసభ్యడిగా గెలిచాక ఎందుకిలా చేస్తున్నారంటే.. ‘‘కూర్చుంటే ఒళ్లు పెరుగుతుంది. తనకు వ్యవసాయం, పశుపోషణపై చిన్నతనం నుంచి ఆసక్తి ఎక్కువ.’’ అని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెబుతున్నారు. ప్రజలను కలిసేందుకు వెళ్లినా తాను వారితో కలసి నడవటం, నిలబడే వారితో మాట్లాడుతుంటానని ఆయన చెప్పుకొస్తున్నారు. నిజంగా ఖద్దరు చొక్కా నలగకుండా, పాలేరులతో పనులు చేయించుకునే వారికి ఇలా గోపాలపురం ఎమ్మెల్యే తలారి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also read:
ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. నాలుగో స్థానంలో భారత ఓపెనర్..
Kawasaki: సరికొత్త బైక్‌ని విడుదల చేసిన కవాసకి.. ధర, ఫీచర్లు అదిరిపోయాయి..?