AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala on AP PRC: ప్రజలకు ఇబ్బంది కలగిస్తే చర్యలు తప్పవన్న సజ్జల.. సమ్మెలో లేమన్న ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం!

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Sajjala on AP PRC: ప్రజలకు ఇబ్బంది కలగిస్తే చర్యలు తప్పవన్న సజ్జల.. సమ్మెలో లేమన్న ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం!
Sajjala Ramakrishna Reddy
Balaraju Goud
|

Updated on: Feb 02, 2022 | 4:01 PM

Share

AP Government PRC Controversy: ఉద్యోగుల(Government Employees) సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) ఎప్పుడు సిద్ధంగానే ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే తీర్చడానికి అవకాశం లేని డిమాండ్స్ అడుగుతున్నారన్నారు.సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు సూచించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉద్యోగుల డిమాండ్స్‌లో రెండు పూర్తయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు.

సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పామన్న సజ్జల.. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సమస్యలను జఠిలం చేసుకోవద్దని సూచించారు. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని ఉద్యోగ సంఘాలకు సజ్జల విజ్ఞప్తి చేశారు. బల ప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని.. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.ఉద్యోగుల కార్యాచరణ వాయిదా వేసుకుని చర్చలకు రావాలని కోరారు. అరెస్టు చేస్తారని తెలిసి ఎందుకు అలాంటి పరిస్థితి తెచుకుంటున్నారన్న సజ్జల.. ఆర్టీసీ విషయంలో ఏ ప్రభుత్వం చెయ్యని మంచి పని సీఎం జగన్ చేశారన్నారు. జనజీవనం స్తంభింప చేయవద్దని సూచించారు.

ఇదిలావుంటే, ఉద్యోగ సంఘాల సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. సమ్మెలో పాల్గొనడం లేదంటూ సజ్జలకు లేఖ ఇచ్చినట్లు సంఘ నేతలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ మాకు మంచి చేశారన్నారు. కరోన సమయంలో ఆరు నెలలు ఇంట్లో ఉన్నా జీతాలు ఇచ్చారు..ఇలాంటి మంచి ప్రభుత్వంకి వ్యతిరేకంగా జరిగే వాటిల్లో మేము పాల్గొనమన్నారు. ఉద్యోగుల డిమాండ్స్‌లో మాకు సంబంధించినవి ఒక్కటీ లేదని ఆర్టీసీ నేతలు.. మేము 13 వేల మంది ఉన్నాం.. పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

Read Also… Telangana: ఎరువుల లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. అస్సలు యవ్వారం తెలిస్తే వామ్మో అంటారు